Tuesday, August 7, 2012

కష్టపడకుండా అందలమెక్కడానికి, పతకాలు సాధించడానికి సులభమైన మార్గం

నేపథ్యం:ఒలింపిక్స్ లో పతకాలు సాధించడానికి చైనావారు పిల్లలను శారీరకంగా,మానసికంగా చాలా బాధపెడుతున్నారన్న వార్త
కష్టపడకుండా రావడానికి అవేమన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు మంత్రిపదవులా?

ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు సాధించాలంటే పసివయసునుంచే తీవ్రంగా శారీరకంగానూ,మానసికంగానూ కష్టపడాల్సిందే! తప్పదు.

 డాక్టర్ సీటో,మంచి ఇంజనీరింగ్ సీటో సంపాదించాలంటే ఎల్కేజీ నుంచే ఐ ఐ టీ కోచింగూ,ఎమ్సెట్ కోచింగూ తీసుకుంటూ తల్లిదండ్రులనూ,బాల్యాన్నీ,ఆటపాటలన్నింటినీ వదలివేసి శారీరకంగా,మానసికంగా కష్టపడాల్సిందే! తప్పదు.

ప్రపంచానికి ఆహారాన్ని అందించాలంటే రైతులు నిద్రాహారాలు,భార్యలను వదలివేసి(రాత్రిపూట పొలాలకు నీళ్ళు పెట్టాలంటే తప్పదుమరి),ఎరువులు,విత్తనాలకోసం క్యూలలో రోజుల తరబడి  పడిగాపులుగాస్తూ ,కూలీల సమస్యలతో శారీరకంగానూ మానసికంగానూ కష్టపడాల్సిందే! తప్పదు.

ఇక శారీరకంగా,మానసికంగా కష్టపడకుండా అందలమెక్కడమెలా అంటారా? అమ్మ సోనియాకు ఊడిగం  చేయడమే! అమ్మను,అమ్మకొడుకునూ అష్టోత్తర,సహస్ర నామాలతో భజన చేయడమే! దీనికి పెద్దగా మెదడును,శరీరాన్ని కష్టపెట్టాల్సిన అవసరం లేదు.చేయవలసిందల్లా సిగ్గూ శరమూ వదలివేయడమే! అందరూ పాటించండి అత్యున్నత ఫలితాలూ,పతకాలూ పొందండి ఆలసించిన ఆశాభంగం

picture courtesy:Google.

 నా టపాలన్నీ ఒకచోట


9 comments:

 1. నిజానికి ఒక రంగంలో ఆరితేరిన వారిని ఆ రంగం నుంచీ మాన్పించడం తమని తాము నాగరీకులు/Naxals/Communist సిద్దాంతాలు ఉన్నవారి అభిలాష.
  ఇప్పుడు ఆ బాధ అనుభవిస్తున్నది అన్నం మనకి అందిస్తున్న రైతు.

  ReplyDelete
 2. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి ఒక్కటే తేరగా వస్తుందేమో. మిగతా దేనికైనా కష్టపడక తప్పదు.

  ReplyDelete
 3. బాగా చెప్పారు..మరి అందుకే ఒక (అ)రాజకీయ నాయకుడి కొడుకు/కూతురు మళ్ళీ (అ)రాజకీయాల్లోకి వచ్చేది ....అది వాళ్ళ అమ్మా/నాన్న పేరు పట్టుకు రావటం..ఏ కష్టం లేకుండా పాపులారిటీ సంపాదించు కోవటం(మనది కూడ తప్పు ఉండి లెండి ...వ్యక్తి పూజ /ఫవరటిసం మనలో ఘనంగా పాతుకు పోయాయి)
  ఆ పైన సంపాదిస్తూ ఉంటే అడిగే వాడు లేకపోవటం!!!
  ఆ చైనా విషయమేనా ఈ మాత్రం బయటకు వచ్చింది అంటే మన మీడియా నే ...రేటింగ్ పెంచడానికి ఏదో తాపత్రయ పడి అటు ఇటు క్లిప్పింగ్ చూపెడ్తుంటారు...
  అదే మన రైతులకు గాని మిగిలిన రంగాలకు గాని ఆ హైప్ లేదు..ఈ కష్ట పడే వాళ్ళను చూడాలి అంటే కాస్త కష్టాలు పడాలి... మట్టి రోడ్లు దాటాలి..ధూళి లో తిరగాలి...మట్టి వాసనలు పీల్చాలి....కాని మన వాళ్లకు ఏ సి కాన్ఫరెన్సు రూమ్లో పెట్టి చాయ్ పానీ...అలవాటు అయిపోయి...అక్కడి అప్ డేట్లు గాని ఈ అప్ డేట్ లు ఎవరికీ పట్టవు...

  ReplyDelete
 4. ఒలంపిక్ పథకాలకోసం వాళ్ళు పడే కష్టాన్ని చూసి నేర్చుకోవాలనుకోము. తేరగా వచ్చే ఉపాధి పతకాలు, ప్రైవేట్ కాలేజీల్లో ఫీజు చెల్లింపు పథకాలు అడ్డుపెట్టుకుని దున్నపోతుల్లా మేయడానికి అలవాటు పడ్డవాళ్ళకి చైనా పిల్లల మెడల్ కష్టాలు చూస్తే ఆక్రోశంతో గుండె తరుక్కు పోదూ?

  రైలు భోగీల్లో నేల తుడుస్తూ, చెత్తకుప్పల్లోని ఎంగిలాకుల్లోది తింటూ, కాకా హోటళ్ళలో కప్పులు కడుగుతూ, పాచి పనులు చేస్తూ గడిచి పోయే మన స్లమ్‌డాగ్స్ మానవ హక్కులూ, స్వేచ్చ చైనా వాడికెక్కడిది? మెడల్సు రాకున్నా మనమే గొప్ప, అంతే! నోప్పుకోనంతె. :P :D

  ReplyDelete