- గ్రహ స్థితులవల్ల 2012లో సంభవిస్తున్న ఉపద్రవాలు,ప్రమాదాలు,ప్రకృతి పరంగా ఎదురయ్యే అన్ని ఇబ్బందులను అధిగమించడానికి, మనం ఎదుర్కొంటున్న సమస్యలు,కష్టాలు తొలగించుకొని సుఖశాంతులు పొందుటకు గ్రహబాధలు లేకుండా ఉండుటకు,విధ్యార్థుల్లో ఏకాగ్రత పెరిగి చక్కటి విజయాలు సాధించడానికి హరిసేవ దుర్గేశ్వరరావుగారు కోటిహనుమాన్ చాలీసా పారాయణం అష్టోత్తర శత కుండీయ హనుమత్ రక్షాయాగం తలపెట్టారు.ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగి అందరూ సుఖశాంతులతో వర్ధిల్లడానికి మహానుభావులు,దైవాంశ సంభూతులైన పరమ గురువుల ఆశీస్సులు పొందాలని సంకల్పించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ధనుర్మాస కాలంలో తాడిపత్రిలో చింతల వెంకటరమణుడు,కోదండరాముడు,రంగనాథస్వాములను సేవిస్తూ నారాయణ అష్టాక్షరీ వైభవం గురించి అధ్బుతంగా అనుగ్రహ భాషణాలు చేస్తున్న శ్రీశ్రీశ్రీ అష్టాక్షరి సంపత్కుమార రామానుజ జియర్ స్వామివారు మేము అడిగినదే తడవుగా ఓయస్సంటూ హరిసేవ దుర్గేశ్వర గారు తలపెట్టిన హనుమత్ రక్షాయాగ కరపత్రాన్ని తమ శ్రీకృష్ణ పెరుమాళ్ళు,ఆచార్యుల పాదాల వద్ద ఉంచి యాగం నిర్విఘ్నంగా జరగాలని,సమస్త మానవాళి సుఖశాంతులతో వర్ధిల్లాలని మంగళా శాసనాలను అందించారు.వారికి సాష్టాంగ దండ ప్రణామములు. యాగ వివరణ
Friday, January 13, 2012
హనుమత్ రక్షాయాగానికి మంగళా శాసనాలు అనుగ్రహించిన శ్రీశ్రీశ్రీ అష్టాక్షరి సంపత్కుమార రామానుజ జియర్ స్వామివారు
Location:
Tadipatri, Andhra Pradesh, India
Subscribe to:
Post Comments (Atom)



0 comments:
Post a Comment