జంతూనాం నరజన్మ దుర్లభమ్ అన్నారు.సృష్టిలోని 84 లక్షల జీవ రాశులలో దుర్లభమైన ఈ నరజన్మ గొప్పదనాన్ని తెలుసుకొని ప్రవర్తించాలి.మానవత్వం పూర్ణత్వమును చెందాలి.మనిషి తన జీవితకాలంలో పూర్ణ గుణములను వరించి పూర్ణాకారాన్ని ధరించాలి.ఇటువంటి పూర్ణత్వమునకే వైకుంఠము అని పేరు.కుంఠము అనగా లోపించుట,కుంటుపడుట అని అర్థము.అవి లేని స్థితియే వైకుంఠము.
ఏకాదశ అంటే పదకొండు 5 పంచేంద్రియాలు,5 జ్ఞానేంద్రియాలు, మనస్సు.వీటన్నిటి ఏకత్వమే పరిపూర్ణస్థితి.అందువల్లనే మనం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం.
వైకుంఠాన్ని(పూర్ణత్వ ప్రదేశము) చేరేందుకు మనకు రెండు ద్వారాలు అడ్డుగా ఉంటాయి.అవి ఆత్మస్తుతి,పరనింద.అసూయ అనే గడియ వేసి ఆ ద్వారాలను బంధిస్తాం.అదీ సరిపోక అహంకారమనే పెద్ద తాళం వేస్తాం.మనం చేసే సాధనలన్నీ ఆ ద్వారాన్ని తెరచేటందుకే.తాళము తెరచి ద్వారాలను తెరచినప్పుడే వైకుంఠం లోనికి ప్రవేశించే వీలవుతుంది.భక్తి ఉండటమే ఆ తాళాన్ని తీసేటందుకు కావలసిన కీలకము.
మరి వైకుంఠ ఏకాదశినాడు తిరుమలలో V.I.P లు V.V.I.Pలు అని చెప్పబడే వాళ్ళు చేసిన పనేమి?తి తి దేవస్థానం మాకు సరిగ్గా దర్శనం ఏర్పాటు చేయలేదు,ఇన్నేళ్లలో ఎప్పుడూ ఇలాంటి దర్శనం చేసుకోలేదు అని మీడియా ముందు బాధపడ్డారు.తాము గొప్పవాళ్ళమనే ఆత్మస్తుతి.దర్శనం సరిగ్గా కల్పించలేదనే పరనింద,అహంకార ప్రదర్శన.మరి ఇలాంటి ప్రవర్తనతో వీరు వైకుంఠాన్ని నిజంగా చేరుకుంటారా? ఆ భగవంతుడు వీరి అహంకారాన్ని మన్నిస్తాడా? ప్రజా సేవకులమంటారు,ప్రజలే దేవుళ్ళంటారు ఆ దేవుని ముందే ప్రజలను అవమానించడం కాదా?మీ అందరకూ భగవంతుని దగ్గర రాచమర్యాదలు చేస్తూ ఉంటే లక్షలాదిగా తరలి వచ్చిన మాలాంటి సామాన్య భక్తుల పరిస్థితేంటి?
ఎంత త్వరగా ఏడుకొండలెక్కితే అంత త్వరగా శ్రీనివాసుని దర్శించుకుంచుకోవచ్చు కదా అని ఒక్క నిమిషం కూడా సేదతీరకుండా జవవరి 4 వతేదీనాడు 2 గంటలలోనే అలిపిరి మార్గం ద్వారా తిరుమల చేరుకుంటే అక్కడ స్వామివారేమో నీకు ఏకాదశి దర్శనం లేదు 6వతేదీ ద్వాదశి రోజు ఉదయం 8గంటలకే నా దర్శనమంటే చిత్తం స్వామీ అని తలనీలాలు సమర్పించుకొని వరాహ స్వామి వారిని దర్శించుకొని తిరుపతికి మరలి వచ్చాను.ద్వాదశి రోజయినా త్వరగా దర్శనమిచ్చారా అంటే అదీ లేదు ఉదయం 7 గంటలకు క్యూలో కెళ్తే మధ్యాహ్నం 1 గంటకు దర్శనమిచ్చారు అదీ లిప్తకాలం పాటు.స్వామివారి దర్శనం కోసం మూడు రోజులు వేచి ఉన్న మాకు బాధ కలగాలిగానీ వస్తూనే శ్రీనివాసుని దర్శనమయిన V.I.Pలు అనబడే మీకెందుకు? మీరు కూడా మాలాంటి సామాన్య ప్రజల మాదిరి క్యూ లైన్లలో వస్తే తెలుస్తుంది మాకన్నా మీరెంత అదృష్టవంతులో అని? ఆ దర్శనంలో ఉన్న ఆనందమేమిటో కూడా మీకు తెలుస్తుంది.సులభంగా దర్శనం పొందుతుండడం వల్లనే కాబోలు ఆ స్వామిపై మీకు భక్తి కూడా కరువవుతోందనిపిస్తోంది. అయినా లక్షలాదిగా తరలి వస్తూ ఉంటే ఎవరైనా ఎంతని సేవలందిస్తారు. తి తి దేవస్థానంవారు మాత్రం చక్కటి ఏర్పాట్లు చేసారనే చెప్పాలి.క్యూలైన్లలో చిక్కటి వేడి పాలను,అల్పాహారాలను భక్తులకు అందిస్తున్నారు.ముఖ్యంగా పరిశుభ్రత విషయం.తిరుమలలోనే కాదు కాలి నడక ప్రాంతంలోనూ,రహదారి మార్గంలలో కూడా పరిశుభ్రతను చక్కగా అమలు పరుస్తున్నారు.శుభ్రపరచేవారికి నా నమస్సులు.వారికి భక్తులుగా మన వంతు సాయం కూడా అందిస్తే బాగుంటుంది.పాలు ,అల్పాహారాలు తీసుకున్న తర్వాత గ్లాసులు,పేపర్ ప్లేట్లు క్యూలైన్లలో ఎక్కడ బడితే అక్కడ వదలి వేయడం కనిపిస్తూ ఉంటుంది. అడుగడుగునా చెత్తకుండీలను ఏర్పాటు చేసినా వాటిలో వేయకుండా ఎక్కడంటే అక్కడే పారవేస్తుంటారు.చెత్తకుండీల్లో వేస్తే పారిశుద్ధ పనివారికి సహాయం చేసిన వారమవుతాము.
క్యూలైన్లలో భక్తులు ఏమయితే చేయకూడదో అవే చేస్తుంటారు.నిశ్శబ్ధం పాటిస్తూ,లేదా గోవింద నామ స్మరణ చేస్తూ సాగాల్సిన నడక చెత్త రాజకీయ విషయాల గురించో లేదా సినిమాల గురించో గట్టిగా మాట్లాడుతూ శబ్ధకాలుష్యాన్ని సృష్టిస్తుంటారు.ఇంకొంత మందేమో జంతికలూ,వడియాలను పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ తింటూ ఉంటారు.తినేవాళ్ళకు ఆనందమేగానీ ప్రక్కనున్న వారి పరిస్థితి మాత్రం ఘోరం.
ఈసారి కాలినడకలో నేను గమనించిన మంచి విషమేమిటంటే దాదాపు 95 శాతం భక్తులు పాదరక్షలు లేకుండా కొండ ఎక్కడం.ఇది మంచి పరిణామం.ఇంకా కొంతమంది మోకాళ్ళ పర్వతాన్ని మోకాళ్ళతో ఎక్కడం, వికలాంగులు కూడా కొండ నడచి ఎక్కడం నాకు ఆనందం కలిగించిన విషయం.
ఏది ఏమైనా దర్శనంలో చాలా ఆలస్యమయినా కూడా ఈసారి తిరుమల శ్రీనివాసుని వైకుంఠ దర్శనం నాకు మధురానుభూతులను అందించింది.

ఈ VIP జాతి జంతువులు దేవుడు కూడా తమకి లొంగి ఉండాలని అనుకుంటాయి. వీలయితే తాము తమ కాటేజీలలో ఉంటే మూల విగ్రహాన్నే అక్కడకి తిసుకొచ్చి తమకు చూపించాలని కోరినా కోరుతారు.
ReplyDeletehmm... :(
ReplyDeleteక్యూలైన్లలో భక్తులు ఏమయితే చేయకూడదో అవే చేస్తుంటారు.నిశ్శబ్ధం పాటిస్తూ,లేదా గోవింద నామ స్మరణ చేస్తూ సాగాల్సిన నడక చెత్త రాజకీయ విషయాల గురించో లేదా సినిమాల గురించో గట్టిగా మాట్లాడుతూ శబ్ధకాలుష్యాన్ని సృష్టిస్తుంటారు.ఇంకొంత మందేమో జంతికలూ,వడియాలను పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ తింటూ ఉంటారు
ReplyDelete--------------------------------
అబ్బా నిజమండి ఇది మాత్రం భయంకరం , అంత కష్టపడి అక్కడి కో వచ్చి ఆ క్యూలో నిలబడిన కాసేపు నోరు కట్టేసుకోలేరా అనుకుంటాను నేను .