ఇంతకు మునుపు అంటే ఓ ఏడెనిమిది సంవత్సరాల క్రితం శనగ పైరులో క్రిమి సంహారక మందు పిచికారీ చేయాలంటే తలప్రాణం తోక్కొచ్చేది.ఎందుకంటే శనగ పైరులో ఎక్కువ నడిస్తే కాళ్ళు పుండ్లయితాయి.శనగ మొక్కల్లో పులుపు ఎక్కువ ఉంటుంది.ఒకటి రెండు రోజులు నడిస్తే కాళ్ళన్నీ మంటలు దురదని గోకడం మొదలుపెట్టామా గోకుడుకు అంతముండదు ఫలితం కాళ్ళన్నీ పుండ్లు.శనగకు మందు కొట్టాలంటే కూలీలతో కూడా సమస్య.మందులోనికి నీరు కావాలంటే ట్రాక్టర్లున్నవారికి,ఎద్దులున్నవారికి పరవాలేదు డ్రమ్ముల్లో తెచ్చుకుంటారు.లేనివారు కూలీలతో దూరం నుంచి మోయవలసిందే.ఇప్పుడా సమస్య లేదు ట్రాక్టర్‍తోనే పిచికారీ.నీటికి కూడా సమస్యలేదు 500 లీ.పట్టే సింటెక్స్ ట్యాంకు బిగించబడి ఉంటుంది.ఒకప్పుడు క్రిమి సంహారక మందులు కూడా ఎక్కువ మోతాదులో వేయాల్సి వచ్చేది.వాటితో ఆరోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమయ్యేవి.ఇప్పుడేమో 500లీ ట్యాంకుకు ఓ 50మి.లీ లేదా ఓ వంద గ్రాముల మందు సరిపోతుంది.ఇప్పటి మందులతో ఆరోగ్యానికి కూడా సమస్యలేదు.ఈ సాంకేతిక విప్లవానికి ధన్యవాదాలు.ఇప్పుడు మనుషులతో పనిలేదు,శరీరాలకు ఇబ్బంది లేదు.హాయిగా ట్రాక్టర్ మీద కూర్చుని రోజూ ఎన్నిఎకరాలకయినా మందు పిచికారీ చేయవచ్చు.మొదట్లో నాజిల్స్ తో స్ప్రే చేసేవారము.తర్వాత స్ప్రేగన్లతో మనుషులు కూర్చుని స్ప్రే చేసేవారము.ఇప్పుడు మనుషులతో పని లేకుండా వైపర్లు బిగించారు.

మంచి సమాచారం.
ReplyDeletemaa vuru eedumudi (prakasam)loe ee vidhaanam 1984 numchea vundi
ReplyDeletekaavuuri