ఇంటి ముందు పెరడులో రెండు సొర విత్తనాలు నాటా.కాయలు కాస్తే మనం తింటూ తెలిసిన వాళ్ళందరకూ నాలుగు కాయలు పంచుతూ చివర్లో కొన్ని కాయలను ఎండేవరకు ఉంచి వాటిపైన బొమ్మలేసుకుంటూ ఎండాకాలం కాలక్షేపం చేద్దామనుకుంటే చూడండి రామ సైన్యం ఎంత పని చేసిందో! అయినా వారి(రామసైన్యం) తప్పేమీ లేదులెండి అడవులను నాశనం చేసి వాటికి నిలువనీడ లేకుండా,ఆహారం దొరక్కుండా చేస్తున్నామాయె.మనమేమో మూడు పూటలా మ్రెక్కుతున్నాం,వారికీ ఆహారం కావాలిగదా!ఊరిమీద పడి ఇలా చేయక తప్పడం లేదు వారికి.గాలికి పోయిన పేలపిండి కృష్ణార్పణమస్తులా గాకుండా వారి కడుపు నిండితే అంతకన్నా సంతోషమేముంది. ఏమంటారు?




విజయ మోహన్ గారు...... :)
ReplyDelete:)
ReplyDeleteshubham
ReplyDeletesvaami tarapuna aayanasainyam sveekarimchaaru
హ్మ్మ్... ;)
ReplyDelete