Friday, December 31, 2010

విషాదానికి వీడుకోలు ఆనందానికి ఆహ్వానం


2010 సంవత్సరం మా రైతు జీవితాల్లో అత్యంత విషాదాన్ని మిగిల్చిపోయింది


కనీసం 2011 సంవత్సరానివి నువ్వైనా మా జీవితాల్లో ఆనంద వెలుగు జ్యోతిని వెలిగిస్తూ సంతోషకరమైన ,ఆహ్లాదకరమైన ముఖారవిందంతో నల్లని విషాదమనే మేలి ముసుగును తొలగిస్తావా?

బ్లాగు మిత్రులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు
నా టపాలన్నీ ఒకచోట

Monday, December 27, 2010

Aతో అ ఆ ను హత్య చేయిస్తున్నామా?


అ మ్‍మ్‍మ్ ఆఆఆAAAAAAA


ఇంటర్ దాకా.. తెలుగు బోధన తప్పనిసరి
నిర్బంధంగా అమలు చేయాలి
బాషాభివృద్ధిలో కర్ణాటక, తమిళనాడు భేష్

ఇక్కడ సంస్కృతి, కళలకు ప్రోత్సాహం లేదు

నా టపాలన్నీ ఒకచోట

వ్యవసాయానికి పేద్ద పీట వేసినాము, అందరికన్నా మేమే రైతుకు ఎక్కువ చేసామంటున్న వారిని చూసి ఉల్లి పక్కున నవ్వుతోంది





ఉల్లి ధరలపై ప్రధాని వివరణ అడగలేదు--కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్ ఎందుకడుగుతాడు ఆయనింటికి రెండు మూటల ఉల్లిపాయలు ఉచితంగా పంపించారు కదా మీరు.
నా టపాలన్నీ ఒకచోట

Saturday, December 25, 2010

హిందువులు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తే క్రిష్టియన్లు స్వీకరిస్తారా ?


హిందువులు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తే క్రిష్టియన్లు స్వీకరిస్తారా ?

ఇది క్రిస్మస్ పర్వదిన సందర్భంలో ప్రతి సంత్సరం నా మదిలో మెదిలే సందేహం.నా సందేహానికి కారణమేంటంటారా? ఉంది అదే నేను ఇప్పుడు చెప్పబోయేది.నేను ఏ గుడికి వెళ్ళి వచ్చిన అక్కడనుంచి తెచ్చిన దేవుని ప్రసాదాన్ని అందరితో పంచుకోవడం నాకలవాటు.ఈ అలవాటు ప్రకారం ఇచ్చేటప్పుడు కొంతమంది తీసుకునేవారు కాదు.మొదట్లో వాళ్ళిళ్ళమో ఏమైనా అశుభమేమైనా జరిగిందేమో అందుకు వద్దంటున్నారని అనుకునేవాణ్ణి.కానీ తర్వాత తర్వాత తెలిసింది వాళ్ళు క్రిష్టియన్లు కాబట్టి తీసుకోరని.మా పల్లెలో ముస్లిములు కూడా ప్రసాదమిస్తే కళ్ళకద్దుకుని తీసుకునేవారు.అందువల్ల ప్రతి ఒక్కరూ తీసుకుంటారేమో అని భావించేవాణ్ణి. మేము చిన్నప్పుడు నంద్యాలలో ఉన్నప్పుడు మేము బాడుగకు ఉన్నది క్రిష్టియన్ల ఇంటిలోనే.మా ప్రక్క ఇంటిలో కూడా రేడియాలజిస్టయిన ఓ క్రిష్టియన్ కుటుంబముండేది.వాళ్ళు మాతో చాలా చక్కగా కలిసిపోయి ఒకే కుటుంబ సభ్యుల్లా మెలిగేవారు.హిందూ పర్వదినాలప్పుడు మేమిచ్చే ఆహారాన్ని,ప్రసాదాన్ని ఆనందంతో నిరభ్యంతరంగా తీసుకునేవారు.అలాగే వారి పండుగలప్పుడు కూడా వారిచ్చేవాటిని మేమూ అలాగే తీసుకునేవారం.అందువల్ల నేనిచ్చే ప్రసాదాన్ని అందరూ తీసుకుంటారు కదా అని భావించేవాణ్ణి.మా కుటుంబ వైద్యుని దగ్గర పనిచేసే ఓ నర్సమ్మకు ప్రసాదమివ్వబోగా ఆమె తీసుకోలేదు.ఎందుకని అడగ్గా మేము హిందువులిచ్చే ప్రసాదాన్ని తీసుకోమని చెప్పింది.ఎందుకంటే ఆమెనుంచి సమాధానంలేదు.అప్పటినుంచే క్రిష్టియన్లు హిందూ ప్రసాదాన్ని తీసుకోరనే విషయం తెలిసింది.ఎందుకనేది ఎవరైనా తెలిస్తే చెప్పండి.

అదే విధంగా ఓ హిందూ క్రిస్మస్ శుభాకాంక్షలు చెబితే స్వీకరిస్తారా లేదా అని అనుమానం.వాళ్ళు స్వీకరించనీ ,రించకపోనీ నేను మాత్రం చెప్పాలని అనుకుంటున్నా.

క్రిష్టియన్ సోదరులకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు.

క్రిస్మస్ రోజు జన్మించిన వాజపేయిగారికి జన్మదిన శుభాకాంక్షలు.



అలాగే బ్లాగర్ సుబ్రహ్మణ్య చైతన్యగారికి కూడా (http://swarnmukhi.blogspot.com/) జన్మదిన శుభాకాంక్షలు.
నా టపాలన్నీ ఒకచోట

Friday, December 24, 2010

చిన్నారి తేజోరాదిత్యకు పుట్టినరోజు జేజేలు



చిన్నారి తేజోరాదిత్యకు పుట్టినరోజు జేజేలు.
రెండు సంవత్సరాలు నిండి మూడవ సంవత్సరంలోకి అడుగువేస్తున్నాడీ రోజు.
మూడవ సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆట పాఠశాలలోకి కూడా(play school) అడుగుపెట్టాడు.ఏమి కాలమో ఏమోగానీ మూడవ ఏడు రాకుండానే బడి.అయినా తప్పడంలేదు అల్లరి ఎక్కువయింది.ఇంట్లో ఒక్కడే అక్కడన్నా అయితే ఆడుకోవడానికి పిల్లలుంటారని ఆలోచన.నగర ఆపార్టుమెంటు జీవితాలు ఇంట్లో ఆనందంగా ఆడుకోవడానికి తోడు కరువు, పెద్దల ఆలనాపాలనాలుండవు.ఎంతసేపు వాళ్ళమ్మే,నాన్నేమో ఉదయమెళ్తే వచ్చేది రాత్రికే.ఇంకెలా ?తప్పలేదు.
అయినా వీడు బెద్దోడయిపోయాడులెండి మొన్నోసారి వాళ్ళ నాన్న షేవింగు చేసుకునేది చూశాడేమో వీడు కూడా అద్దం ముందు పెట్టుకుని రేజర్ తీసుకుని వాళ్ళ నాన్నను అనుకరించడం మొదలుపెట్టాడు.ఆ రేజర్ క్రొత్తది సీల్డ్‍ది కావడంతో ప్రమాదం తప్పింది. వాళ్ళమ్మ,నాన్నలు పూజ చేస్తుంటే మంత్రాలు చదువుతూ అగరుబత్తీ త్రిప్పుతాడు.తీర్థమేస్తాడు.ఇస్కాన్ గుడికెళ్తే పడిపడి మ్రొక్కుతాడు,భజన చేస్తాడు.ఇంక స్కూలులో అయితే అమ్మాయిల రబ్బరుబ్యాండులు హెయిర్ చ్లిప్పులు లాగడంలాంటి తుంటరి పనులు మామూలే.

ఇలాంటి మా చిన్నారి చిలిపి కృష్ణునికి మరోసారి పుట్టినరోజు జేజేలు.వ్యవసాయ పనులతో ఈ సంవత్సరం పుట్టినరోజుకు వెళ్ళలేకపోయినందుకు చాలా బాధగా ఉంది.
(చిత్రంమాత్రం తేజాది కాదు)
నా టపాలన్నీ ఒకచోట

Thursday, December 23, 2010

వాళ్ళతో మమ్మల్ని పోలుస్తారా ?

రాష్ట్రాన్ని పాలిస్తున్నది ...ప్రభుత్వమా ...గాడిదలా ? నారాయణ మండిపాటు


మమ్మల్ని వాళ్ళతో పోలుస్తారా? గుర్ర్ర్ర్ర్ ర్ర్ ర్ర్ ర్ర్


పనికిమాలిన వాళ్ళతో మమ్మల్ని పోల్చినందుకు తీవ్రంగా నిరసన తెలియజేస్తున్నాం


మేము బరువులు మోసి ప్రజలకు సేవ చేస్తాం,రాష్ట్రసొమ్మును మూటలు మూటలు మోసి నాశనం చేసిన ఇలాంటి పనికిమాలిన నాయకులనెన్నుకున్న ఈ రాష్ట్రంలో నేనుండలేను బాబూ!పారిపోతున్నా

గూగులమ్మ ద్వారా తమ చిత్రాలను ప్రచురించేటందుకు అంగీకరించిన గార్దభశ్రేష్టులకు ధన్యవాదములు

నా టపాలన్నీ ఒకచోట

Wednesday, December 22, 2010

ఉల్లి ధరను తగ్గించండి అని మంత్రులను ఆదేశించగానే మంత్రులంతా జేరి ధరను తగ్గించేసారు రండి చౌక బేరం ఆలసించిన ఆశాభంగం

భారత ప్రధాని మన మోహన్ సింగు గారు ఉల్లిధరను తగ్గించమని తన మంత్రులను కోరారు.

మంత్రులంతా ఆయన ఆదేశాలను వేంఠనే అమలుజేసే పనిలోబడ్డారు.మంత్రులు ఉల్లిధరను తగ్గించడానికి ఏమి చేసారో చూద్దామా మరి. చూసి బ్యాగులు పట్టుకొని లగెత్తుకొచ్చేయండి ఉల్లి ధరలన్నీ తగ్గించేస్తారు మరి మన మంత్రులంతా.

ప్రణబ్ ముఖర్జీ: ఉల్లి సాగుకు ఎన్నివేలకోట్లు బడ్జెట్‍లో కేటాయించాలో ఆలోచిస్తున్నా.

చిదంబరం : రాష్ట్రాలను కోసినట్లు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కోస్తే సర్దొస్తుంది.తద్వారా వంటలో తక్కువ ఉల్లిపాయలు పడతాయి.

.కే.ఆంటోనీ: సైనికులతో హిమాలయాల్లో ఉల్లిసాగు చేయిస్తే పంట దిగుబడి పెరిగి ధరలు తగ్గుతాయి కదా అని నా ఆలోచన.

శరద్ పవార్: ఐపీఎల్ క్రికెట్టు ఆటగాళ్ళతో క్రికెట్టు స్టేడియాలలో ఉల్లిసాగు చేయించే పనిలో ఉన్నా.

ఎస్.ఎమ్.కృష్ణ: విదేశాల్లో ఉల్లి ఏవిధంగా సాగు చేస్తారో తెలుసుకుని ఆ పద్దతులను మనదేశంలో ప్రవేశపెట్టడానికి ఓ ఐదువేల మంది అధికారులను వెంటేసుకుని విదేశపర్యటనకు బయలుదేరుతున్నానండి.

మమతా బెనర్జీ: దేశంలోని ఉల్లిపాయలను రైళ్ళలో బెంగాల్‍కు రవాణా చేయడానికి ఓ నలభై క్రొత్తరైళ్ళను ప్రవేశపెడుతున్నా.

వీరభద్ర సింగ్: ఉల్లిపాయలు చెడిపోకుండా ఉక్కుమాదిరిగా చిరకాలం నిలువ ఉండేటట్లు జన్యుమార్పిడి చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నా.

విలాసరావు దేశ్‍ముఖ్: ఉల్లిపాయలను చేలలో పండించడం కాకుండా యంత్రాలతో తయారుచేయవచ్చా అని ఆలోచిస్తున్నా.

గులాం నబీ ఆజాద్: ఉల్లిపాయలను ఎక్కువ వాడితే ఆరోగ్యానికి హానికరమని వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ప్రచారం చేయిస్తే ప్రజలు వాడడం తగ్గిస్తారు కాబట్టి ధరలు తగ్గే అవకాశముంది.

సుశీల్‍కుమార్‍షిండే: ఉల్లిసాగుకు విధ్యుత్ కోత లేకుండా చూడడం ద్వారా ఉల్లిపంట అధికంగా పండించడానికి వీలు కలుగుతుంది.

వీరప్పమొయిలీ: ఉల్లిరైతులకున్న సమస్యలను న్యాయపరంగా,చట్టపరంగా ఎలా ఎదుర్కోవాలో రైతులకు సలహాలిస్తాం.

డా.ఫరూఖ్‍అబ్దుల్లా: ఉల్లిని పండించడానికి ఇంకా ఏమైనా క్రొత్త పద్ధతులు ఏమైనా ఉన్నాయా అని పరిశీలిస్తాం.

ఎస్.జయపాల్ రెడ్డి పట్టణాలలో ఇళ్ళ పెరడులలోనూ తారు రోడ్లమీదా,రోడ్డు డివైడర్లలో ఉల్లిని పండించడానికి పథకాలు రూపొందించమని అధికారులను ఆదేశించా.

కమల్‍నాథ్: వాహనాలమీద మట్టి నిలబడేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోమని ఆ మట్టిలో ఉల్లిని పండించమని వాహన యజమానులను ఆదేశాలు జారీ చేస్తాము.అలాగే జాతీయ రహదారుల ప్రక్కన,మధ్యలో కూడా ఉల్లి సాగు ప్రారంభిస్తాం.

వాయలార్ రవి: ఉల్లి ధర విషయంపై విదేశీయులు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తా.


దయానిధిమారన్: ఉల్లి చెడిపోకుండా నిలువ ఉంచడానికి వస్త్రాలేమైనా పనికి వస్తాయేమో ఆలోచిస్తాం.

మురళీదియోరా: అవసరమైతే పెట్రోలు,డీజెల్‍లపై లీటరుకు యాభై,అరవై రూపాయలు పెంచి ఆ సొమ్మును ఉల్లిసాగు రైతులకు output సబ్సిడీగా వినియోగిస్తాం.

అంబికాసోని :ఉల్లి ధరలు,పంట విస్తీర్ణం,దిగుబడి వివరాలను అందరకూ ప్రసార మాధ్యమాల ద్వారా తెలియజేస్తాం.

మల్లిఖార్జునఖార్గే: ఉల్లి సాగుకు అవసరమైన కూలీల కొరత లేకుండా చూస్తాం.

కపిల్‍సిబాల్: ఉల్లిసాగుకు మానవ వనరుల కొరత లేకుండా చేస్తాం.

బి.కె.హందిక్: ఉల్లిని గనుల్లో కూడా పండించడం ద్వారా ధరలను నియంత్రిస్తాం.

ఆనంద్‍శర్మ: పరిశ్రమలలోని ఖాళీ స్థలాల్లో పండించమని పరిశ్రమల యజమానులను ఆదేశిస్తాం.

సి.పి.జోషి : ప్రాంతాల్లో ఉల్లిసాగులో పాలు పంచుకోమని పంచాయతీ అధికారులకు చెబుతాం.

కుమారి సెల్జా: మురికి వాడల్లోనూ,టూరిజం ప్రదేశాల్లో కూడా ఉల్లి సాగుకు ప్రయత్నాలు ప్రారంభించాం.

సుభోద్‍కాంత సహాయ్ : ఎక్కువకాలం నిలువ ఉండేలా చేసేటందుకు అవసరమైన రీసెర్చికి శాస్త్రవేత్తలకు నిధులు మంజూరు చేస్తాం.

డా.ఎం.ఎస్.గిల్ ఉల్లి సాగులో పాలుపంచుకోవటానికి యువకులకు,క్రీడాకారులకు శిక్షణనిస్తాం.

జి.కే.వాసన్: పండిన ఉల్లిని దేశమంతా సరఫరా చేయడానికి నౌకామార్గాన్ని సమర్థవంతంగా ఉపయోగిస్తాం.

పవన్ కే.బన్సాల్: ఉల్లి విషయమై ప్రతిపక్ష సభ్య్లుల ఆరోపణలను సమర్థవంతంగ ఎదుర్కొంటాం.

ముకుల్‍వాస్నిక్: ఉల్లిని ఎక్కువగా వాడే ముస్లింలకు,అణగారిన వర్గాలకు అధిక సబ్సిడీతో అందజేస్తాం.

కాంతిలాల్‍బూరియా: ఉల్లిసాగుపై గిరిజనులకు అవగాహన కల్పించడానికి ఎన్ని వేల కోట్ల ఖర్చయినా వెనకాడం.

ఎం.కె.అళగిరి: ఉల్లిసాగు చేసే తమిళనాడు రైతులకు రసాయనిక ఎరువులు అధిక సబ్సిడీతో అందజేస్తాం.

1. Pranab Mukherjee Minister of Finance
2. P. Chidambaram Minister of Home Affairs
3. AK. Antony Minister of Defence
4. Sharad Pawar Minister of Agriculture, Food & Consumer Affairs
5. S.M. Krishna Minister of Foreign Affairs
6. Mamata Banerjee Minister of Railways
7. Virbhadra Singh Minister of Steel
8. Vilasrao Deshmukh Minister of Heavy Industries and Public Enterprises
9. Ghulam Nabi Azad Minister of Health and Family Welfare
10. Sushil Kumar Shinde Minister of Power
11. M. Veerappa Moily Minister of Law and Justice
12. Dr. Farooq Abdullah Minister of New and Renewable Energy
13. S. Jaipal Reddy Minister of Urban Development
14. Kamal Nath Minister of Road Transport and Highways
15. Vayalar Ravi Minister of Overseas Indian Affairs
16.
17. Dayanidhi Maran Minister of Textiles
18.
19. Murli Deora Minister of Petroleum and Natural Gas
20. Ambika Soni Minister of Information and Broadcasting
21. Mallikarjun Kharge Minister of Labour and Employment
22. Kapil Sibal Minister of Human Resource Development
23. B.K. Handique Minister of Mines and Minister of Development of North Eastern Region
24. Anand Sharma Minister of Commerce and Industry
25. C.P. Joshi Minister of Rural Development and Minister of Panchayati Raj
26. Kumari Selja Minister of Housing and Urban Poverty Alleviation and Minister of Tourism
27. Subodh Kant Sahay Minister of Food Processing Industries
28. Dr M.S. Gill Minister of Youth Affairs and Sports
29. G.K. Vasan Minister of Shipping
30. Pawan K. Bansal Minister of Parliamentary Affairs
31. Mukul Wasnik Minister of Social Justice and Empowerment
32. Kantilal Bhuria Minister of Tribal Affairs
33. M.K. Azhagiri Minister of Chemicals and Fertilizers

నా టపాలన్నీ ఒకచోట

Friday, December 17, 2010

యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః

గీతా జయంతి శుభాకాంక్షలు


యత్ర యోగేశ్వర కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః !
తత్ర శ్రీ ర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమః !!
భగవద్గీత 18 అ,78 శ్లో.

యోగేశ్వరుడైన కృష్ణుడు,ధనుర్ధరుడైన అర్జునుడు ఎక్కడ ఉంటారో, అక్కడ సంపద,విజయం,గొప్పదనం,స్థిరమైన నీతి ఉంటాయని నా(సంజయుడు) నిశ్చయం.

గీతాజయంతి శుభాకాంక్షలు

నా టపాలన్నీ ఒకచోట

వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు

వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు



వైకుంఠ ఏకాదశి వైభవం

వైకుంఠ ఏకాదశి శాస్త్రీయ వివరణ సత్యనారాయణ శర్మగారి వ్యాసం ఇక్కడ చదవండి




బాపూగారి కుంచెనుంచి జాలువారిన అద్భుత వర్ణ చిత్రాలను స్వంతం చేసుకోవాలంటే ఇక్కడ లభిస్తాయి http://bapuartcollection.com/

నా టపాలన్నీ ఒకచోట

Wednesday, December 15, 2010

నా బాపు కిట్టయ్యలు--బాపూగారి జన్మదిన సందర్భంగా

బాపూగారికి జన్మదిన శుభాకాంక్షలు



బాపూగారి కుంచెనుంచి జాలువారిన అద్భుత వర్ణ చిత్రాలను స్వంతం చేసుకోవాలంటే ఇక్కడ లభిస్తాయి ఆలస్యమెందుకిక ఆర్డరివ్వండి మరి http://bapuartcollection.com/

నా టపాలన్నీ ఒకచోట

Sunday, December 12, 2010

అసలు సిసలైన కథానాయకునికి జన్మదిన శుభాకాంక్షలు


అసలు సిసలైన
స్వచ్చమైన
నిఖార్సైన
నిజజీవితంలో కూడా కథానాయకుడైన
భేషజంలేని
స్థితప్రజ్ఞుడు
మానవత్వమున్న
మంచిమనిషి
నా అభిమాన ఏకైక కథానాయకుడు రజనీకాంత్‍గారికి జన్మదిన శుభాకాంక్షలు.

ఈ రోజు తెలుగు బ్లాగుల దినోత్సవం రండి అసూయలతో ,కక్షలూ కార్పణ్యాలతో ఒకరిమీదొకరు దుమ్మెత్తిపోసుకుందాం,తెలుగు బ్లాగులకు దినం పెడదాం


కూడలి సంకలిని నిర్వాహకులు వీవెన్‍గారు తెలుగు బ్లాగుల దినోత్సవానికి ఆహ్వానిస్తున్నారు
http://veeven.wordpress.com/2010/12/09/telugu-blogs-day/

వీవెన్‍గారు తెలుగు బ్లాగుల దినోత్సవం ఎలా జరుపుకోవాలో గత సంవత్సరం ఇలా చెప్పారు.

http://veeven.wordpress.com/2008/12/06/december-second-sunday/

కానీ అవన్నీ వద్దు అసూయలతో ,కక్షలూ కార్పణ్యాలతో ఒకరిమీదొకరు దుమ్మెత్తిపోసుకుందాం,తెలుగు బ్లాగులకు దినంపెడదాం.రండి మీరూ కెలుకు కెలకండి. మనమేమీ చెప్పకుండా(మన బ్లాగులో) ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడుమూకుమ్మడిగా గానీ ఒంటరిగాగానీ చెప్పినవాళ్ళమీద ముసుగులేసుకొని(అజ్ఞాత) ఆంగ్లంలో మరీ దాడిచేద్దాం.ఎందుకంటే మాబోటి పల్లెటూరోళ్ళకు ,తెలుగోళ్ళకు అర్థం కాకూడదు కదా.

చాలా మంది సాఫ్టువేర్లే,కానీ మనసులేమో హార్డువేర్లు.

జై తెలుగు బ్లాగులు జైజై తెలుగు బ్లాగర్లు.

Thursday, December 2, 2010

నాడు దేవాదాయ శాఖ పూర్వజన్మ సుకృతం కావడం ,నేడు పనికిరానిది కావడం ఎందుకు?

దేవాదాయ శాఖను కేటాయించడంపై వ్యాఖ్యానించమని కోరినప్పుడు ఆనాడు శ్రీ కనుమూరి బాపిరాజుగారు ఆ శాఖ లభించడం నా పూర్వజన్మ సుకృతమన్నారు.
మరి నేడో దేవాదాయ శాఖను కేటాయిస్తే శ్రీమాన్ జూపల్లి కృష్ణారావుగారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కడుంది తేడా? వ్యక్తులలోనా?లేక దేవాదాయ శాఖలోనా?