Monday, December 21, 2009
ఓ పది రోజులు సెలవు పెడుతున్నా
మా చిన్ని కృష్ణుని దర్శనానికి పుహనా(పూణే) నగరానికెళ్తున్నా.అందుకే ఓ పదిరోజులు సెలవు ప్రకటించడమైనది. చిన్ని కృష్ణుడు మా ఇంటికి వచ్చి వచ్చే 24(డిసెంబర్) నాటికి ఓ సంవత్సరం పూర్తయింది .జన్మదిన సంబరాలకెళ్తున్నాం.సంవత్సరకాలం అప్పుడే గిర్రున తిరిగిపోయింది.కాలం పరుగెడుతూనే ఉంది.కాలస్వరూపునితో పాటు మనది కూడా జీవితంలో పరుగు పందెమే.రెండు నెలలముందు రైల్వే రిజర్వేషన్ చేయించుకున్నా వెయిటింగ్ లిస్టే. 1,2 నెంబర్లే confirm అవుతుందనే అనుకుంటున్నా.చూద్దాం........మళ్ళీ కలుద్దాం
Sunday, December 20, 2009
ఇతర జీవరాశిలో లేని అసూయలు,వైషమ్యాలు మనుష్యుల్లోనే ఎందుకు?
సృష్టిలో వైవిధ్యము,విరుద్ధంగా ఉన్నవే ఒకదానితో ఒకటి కలిసి ఉంటున్నాయి.జీవరాశి మొత్తానికి పరిణతి చెందిన వారని చెప్పుకుంటున్న మనుష్యుల్లో ఎందుకింత ఒకరంటే ఒకరికి సరిపోని అసూయలు,వైషమ్యాలు.
Saturday, December 19, 2009
విష్ణు సహస్ర నామ పారాయణము--దృశ్యమాలిక
మా ఇంటిలో మార్గశిర శుద్ధ ఏకాదశి గీతాజయంతి పర్వదినాన సామూహిక శ్రీ లక్ష్మీ అష్టోత్తర నామ సహిత విష్ణుసహస్రనామపారాయణము జరిగింది.గీతా పారాయణము(ముఖ్యమైన 48 శ్లోకాలు) కూడా చేసాము.ఇలా ప్రతి శనివారం ఒక్కొక్కరి ఇంట్లో జరుగుతుంది. గీతాజయంతి కావున మా ఇంట్లో ఆ రోజు ప్రత్యేకంగా గీతాశ్లోకాలను పఠించడం జరిగింది.సాధారణంగా లక్ష్మీ అష్టోత్తర సహిత విష్ణుసహస్రనామ పారాయణంతో పాటు గోవిందనామాలు పఠించడం చేస్తాము.
కార్యక్రమం అనంతరం వారివారి శక్తి కొలది ప్రసాద వితరణ చేస్తాము.మా ఇంటిలో పారాయణానికి చాలా మంది భక్తులు వచ్చిమమ్మల్ని ఆనందపరచారు. ఆనాటి దృశ్యాలను మీతో పంచుకోవాలని ఇలా.....
నా టపాలన్నీ ఒకచోట
Friday, December 18, 2009
తిరుప్పావై--బాలిగారి చిత్రమాలిక
ఈ చిత్రాలుఆదర్శాచార్య శ్రీమాన్ చిత్రకవి ఆత్రేయగారి తిరుప్పావై పూదండలోనివి.
ఆదర్శాచార్య శ్రీమాన్ చిత్రకవి ఆత్రేయ(రామానుజాచార్య) గారు తిరుప్పావైను తేనెలొలుకు తెలుగులో తాము అనుభవించి,ప్రవచించి గ్రంథరూపంగా కూర్చినారు. అంతరార్థములతో పాశుర వివరణ ,బాలిగారి అద్భుత చిత్రాలు,వ్రతవిధానము,సేవాకాలము అన్నిటినీ "తిరుప్పావై పూదండ" గా అందించారు. ఈ పూదండలో తెలుగు గేయపుష్పాలను చక్కగా కూర్చారు.లలిత పదబంధ బంధురంగా మధురమైన భావపూరితంగా, సుమనోహరంగా,సర్వజన హృదయంగమంగా,పదరమణీయంగా పరమార్థాన్ని(వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రిగారి మాట) ఆవిష్కరించారు. మనం చేయవలసిందల్లా ఆ పూదండను తాము ధరించి స్వామితో ధరింపజేసి ధన్యులు కావడమే
ఆదర్శాచార్యశ్రీమాన్చిత్రకవిఆత్రేయసుప్రసిద్ధపత్రికారచయిత,బహుగ్రంథకర్త.భావుకత,సహృదయత,భగవద్భక్తి,ఔదార్యము మొదలైన లక్షణములు జన్మ సిద్ధములుగా గల ధన్యులు.ప్రసిద్ధ బిల్హణీయాది మహుకావ్యకర్త చిత్రకవి సింగరాచార్యులవారు వీరి వంశ మూలపురుషులు(క్రీ.శ 1775).వీరు అనేక రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఉన్నతాధికారిగా వ్యవహరించారు.
ఈపుస్తకాన్ని ఎమెస్కో ఆర్షభారతి వారు అందించారు.ధర 75రూ.లు
తిరుప్పావై ప్రవచనములు ఇక్కడ
.
నా టపాలన్నీ ఒకచోట
Thursday, December 17, 2009
ధనుర్మాసం ప్రారంభం
డిసెంబర్ మధ్యలో ధనూరాశిలో సూర్యభగవానుడు ప్రవేశించినప్పటినుంచి,జనవరినెల 14న మకరరాశిలోకి ప్రవేశించేవరకు ఉన్న కాలాన్ని ధనుర్మాసమంటారు. అలాగే మృగశీర్షా నక్షత్రముతో కూడిన పూర్ణిమ గల మాసమునకు మార్గశీర్షమాసమని పేరు.రెందూ ఒకటే కానీ చాంద్రమానమును పాటించువారికి అంటే మన తెలుగువారికి మార్గశీర్షమైతే ,సౌరమానమును బట్టి అంటే తమిళులకు ధనుర్మాసమవుతుంది.
భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు "మాసానాం మార్గశీర్షోహం" మాసములలో ఉత్తమమైన మార్గశీర్షాన్ని నేనే అన్నాడు.ఈకాలం దేవతలకు బ్రాహ్మీ ముహూర్తసమయం ,సత్వగుణం వృద్ధిచెందే మంచి సమయం.ఇదే తిరుప్పావై వ్రత సమయం.
మార్గమనగా దారి, ఉపాయము. శీర్షమంటే ముఖ్యమైనది.ముఖ్యమైన దారి ,ఉపాయము ఏమిటంటే ఆ భగవంతున్ని పొందడమే. ఆభగవంతున్ని పొందడానికి మార్గం చూపించేదే ధనుర్మాస వ్రతం.ద్వాపరంలో వ్రేపల్లెలో శ్రీకృష్ణున్ని పొందాలని గోపికలు కాత్యాయనీ వ్రతంగా చేశారు.కలియుగంలో పన్నిద్దరు ఆళ్వార్లలో ముఖ్యురాలైన గోదాదేవి విల్లిపుత్తూరులో ధనుర్మాసవ్రతాన్ని ఆచరించి ,తనతోటివారితో ఆచరింపజేసి శ్రీరంగనాథున్ని పొందగలిగింది.
గోదాదేవి అయోనిజ.విళ్ళిపుత్తూరులో శ్రీవిష్ణుచిత్తులవారికి తులసివనంలో లభించింది.తమిళంలో కోదా అంటే పూదండ .ఆమెకే గోదా అని పేరు వచ్చింది.తండ్రితో బాటే మాలలు కట్టి,వాటిని ముందుగా తాను ధరించి తర్వాత స్వామికి ఇచ్చేది.తండ్రి అపచారమని మందలించినా అలాగే తనకిష్టమని స్వామిని వాటిని ప్రీతితో స్వీకరించాడు. అందుకే ఆమె ఆముక్తమాల్యద, శూడికొడుత్తనాచ్చియార్ అయింది. రోజుకొక పాశురముచొప్పున ముప్పది పాశురములతో శ్రీరంగనాథున్ని స్తుతించి చివరగా స్వామిలో లీనమయింది.
నాలుగు వేదాల సారం తిరుప్పావై.తిరుప్పావైను అనుసంధించని వారి బ్రతుకు వ్యర్థం,అలాంటివారిని భరించడానికి భూమాత వేదనపడుతుందట. మనమందరమూ ఈ ధనుర్మాసపుణ్యసమయాన వేకువజామునే శుచియై తిరుప్పావై పాశురాలను పాడుతూ స్వామివారి కృపకు పాత్రులవుదాం.
ఆదర్శాచార్య శ్రీమాన్ చిత్రకవి ఆత్రేయ(రామానుజాచార్య) గారు తిరుప్పావైను తేనెలొలుకు తెలుగులో తాము అనుభవించి,ప్రవచించి గ్రంథరూపంగా కూర్చినారు. అంతరార్థములతో పాశుర వివరణ ,బాలిగారి అద్భుత చిత్రాలు,వ్రతవిధానము,సేవాకాలము అన్నిటినీ "తిరుప్పావై పూదండ" గా అందించారు. ఈ పూదండలో తెలుగు గేయపుష్పాలను చక్కగా కూర్చారు.లలిత పదబంధ బంధురంగా మధురమైన భావపూరితంగా, సుమనోహరంగా,సర్వజన హృదయంగమంగా,పదరమణీయంగా పరమార్థాన్ని(వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రిగారి మాట) ఆవిష్కరించారు. మనం చేయవలసిందల్లా ఆ పూదండను తాము ధరించి స్వామితో ధరింపజేసి ధన్యులు కావడమే.
ఆదర్శాచార్య శ్రీమాన్ చిత్రకవి ఆత్రేయసుప్రసిద్ధపత్రికారచయిత,బహుగ్రంథకర్త.భావుకత,సహృదయత,భగవద్భక్తి,ఔదార్యము మొదలైన లక్షణములు జన్మ సిద్ధములుగా గల ధన్యులు.ప్రసిద్ధ బిల్హణీయాది మహుకావ్యకర్త చిత్రకవి సింగరాచార్యులవారు వీరి వంశ మూలపురుషులు(క్రీ.శ 1775).వీరు అనేక రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఉన్నతాధికారిగా వ్యవహరించారు.
ఈపుస్తకాన్ని ఎమెస్కో ఆర్షభారతి వారు అందించారు.ధర 75రూ.లు
తిరుప్పావై ప్రవచనములు ఇక్కడ
నాటపాలన్నీ ఒకచోట

Labels:
ఆదర్శాచార్య చిత్రకవి ఆత్రేయ,
గోదాదేవి,
తిరుప్పావై,
ధనుర్మాసం
Tuesday, December 15, 2009
Monday, December 14, 2009
Saturday, December 12, 2009
దశావతారములు --కల్క్యావతారం
దశావతారములు--బుద్ధావతారం మరిన్ని చిత్రాలు
బుద్ధుడు నవ్వాలో వద్దో మీరే నిర్ణయించండి.
(తెలంగాణావాదులు -నవ్వాలి,సమైక్యాంధ్రావాదులు-వద్దు)నా టపాలన్నీ ఒకచోట
Wednesday, December 9, 2009
Sunday, December 6, 2009
Friday, December 4, 2009
దశావతారములు--బలరాముడు
క. ఘనులగు ధేనుక ముష్టిక
దనుజుల(జెండాడి తౌర తగు భుజశక్తిన్
అనఘాత్మ ! రేవతీ పతి
వన(గా బలరామమూర్తి యౌ(గద కృష్ణా .
తా. కృష్ణా ! బలశాలురగు ధేనుక ముష్టికులను దనుజులను
జంపి, సుజనుల రక్షించిన రేవతీ విభు(డవగు బలరాము(డవు నీవే కదా !
శ్రీ కృష్ణశతకము
నా టపాలన్నీ ఒకచోట
Wednesday, December 2, 2009
మా కుగ్రామంలో నూతన రామాలయ నిర్మాణానికి భూమిపూజ
మాగ్రామం అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని మిట్టమీద కొట్టాలపల్లె.మాగ్రామంలో ప్రస్తుతం ఒక రామాలయముంది.ఆలయానికి విమాన గోపురం లేదు,దానికి తోడు కొన్ని అననుకూలతలు ఉండడం వల్ల మళ్ళీ పునర్నిమించుకోవాలని మాఊరి ప్రజలమంతా నిర్ణయించుకున్నాము.దానిలో భాగంగా మొన్న మార్గశిర శుక్ల ద్వాదశినాడు మధ్యాహ్నం 12.30--1.15 అభిజిత్ లగ్నాన భూమిపూజ చేయించాము.భూమిపూజ జరిగే సమయానికి అనుకోని అతిథిగా మన తెలుగు బ్లాగర్ దేవన హరిప్రసాద్ గారు తన స్నేహితులతో మా గ్రామం రావడం మా అదృష్టంగా భావిస్తున్నాను.కార్యక్రమం తర్వాత పిల్లలకూ,పెద్దలకూ పంచకజ్జాయం(బొరుగులు అంటే మరమరాలు,కొబ్బెర,బెల్లము,పప్పులు)మరియు తిరుపతి లడ్డును ప్రసాదంగా పంచడం జరిగింది.ఆలయ నిర్మాణం నిర్విఘ్నంగా జరగాలని ఆ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర ప్రభువును వేడుకున్నాము.
నా టపాలన్నీ ఒకచోట
Tuesday, December 1, 2009
Subscribe to:
Posts (Atom)