Thursday, October 29, 2009

మీరా కృష్ణులు



నా టపాలన్నీ ఒక చోట

5 comments:

ఉష said...

మీరా మదిలో సమీరం
నీ వేణుగానం
ఆ హృదిలో భక్తి సాగరం
నీ నామస్మరణం

కన్నయ్య మట్టుకు నన్ను రాధలోకి పరకాయప్రవేశం చేయించేంత సమ్మోహనంగా వున్నాడు. ఎక్కడిదండీ మీ కుంచెకీ నేర్పు?

jeevani said...

చాలా చాలా బావుందండీ.

భావన said...

హ్మ్మ్.. కృష్ణుడిని చూడగానే ఒక్క సారి నేనైతే వులికి పడి వెంటనే నవ్వుకున్నా. ఎందుకో తెలుసా కృష్ణుడి కుడి చెయ్యి వేణువు ని శ్రుతి చేస్తున్నట్లూ వుంది అంతలోనే రా రమ్మని పిలుస్తున్నట్లు వుంది ఎంత అందం గా వుందో ఆ చెయ్య చూసేరా. అందరికి అభయమ్ము నిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి అని అన్నమయ్య ఇలానే చూసి పాడి వుంటాడు కదా.. అనిపించింది. మీరకో, రాధ కో, అష్ట లక్ష్ములకో.. 16 వేల గొపెమ్మలకో ఎవరికో ఆ రారమ్మన్న సందేశం..
ఉషా "జానకి కన్నుల జలధి తరంగం..
రాముని మదిలో విరహ సముద్రం..
చేతులు కలిపిన సేతు భందనం
ఆ సేతు హిమాచల ప్రణయ కీర్తనం" పాట గుర్తు వచ్చింది.. నువ్వు రాసింది చదివితే..

ఉష said...

భావన, నువ్వు చెప్పిన పాట చాలా బాగుంది. కీర్తన ఆలాపిస్తూ నా రామయ్య చెంతకి పోతున్నానిక ;)

రవి said...

నలుపు తెలుపుల్లో, కన్నయ్య కళ్ళల్లో తడిని చిత్రించటం అద్భుతం. నయనానందకరం గా ఉంది.

Post a Comment