మా స్నేహితుని పదవీవిరమణ కార్యక్రమానికి హాజరయేందుకు మూడురోజులు తిరుపతికి వెళ్ళాను.జూన్ 30 వ తారీఖు ఆరోజు మా పెళ్ళిరోజని నేనూ మాశ్రీమతి ఇద్దరమూ కలిసి శ్రీశ్రీ రాధాగోవింద అష్టసఖి గిరిరాజ్ కమల మందిరానికి(ఇస్కాన్) వెళ్ళి అక్కడ రాధాగోవిందులను రాధాదేవి సఖులైన శ్రీమతి తుంగవిద్య, శ్రీమతి సుచిత్ర, శ్రీమతి చంపకలత, శ్రీమతి లలిత, శ్రీమతి విశాఖ, శ్రీమతి ఇందులేఖ, శ్రీమతి రంగదేవి ,శ్రీమతి సుదేవిలను ,శ్రీ శ్రీలప్రభుపాదుల నూ దర్శించుకున్నాము.ఇస్కాన్ దేవాలయాలు ఏ ఊరిలో ఉన్నా నిర్మాణ కౌశలంలో ఒకదానితో ఒకటి పోటీపడుతూ దేనికదే ప్రత్యేకతను కలిగిఉంటాయి. కృష్ణునికి సంబంధించిన కుడ్యచిత్రాలతో ,దశావతారాల చిత్రాలతోనూ అద్బుతంగా ఉంది.గుడి బయట చక్కని ఉద్యానవనం ,చిన్న కోనేరు,తులసివనం ఉన్నాయి .రాధాగోవిందులనూ,రాధాదేవి అష్టసఖులనూ కమలాలతోనూ, పుష్పమాలలతోనూ అధ్బుతంగా అలంకరించారు. చూస్తూ వుంటే వదలి రావాలనిపించదు. యథాప్రకారం అక్షయ కార్యక్రమానికి కొద్ది మొత్తాన్ని సమర్పించుకున్నా.
తిరుపతి ఏడుకొండలవానితో పాటు తప్పక దర్శించుకోవలసిన గోవిందుడీయన.తిరుపతికి వెళ్ళినప్పుడు తప్పక దర్శించుకుంటారు కదా !.దేవాలయం అలిపిరికి దగ్గరగా వున్న బస్సుప్రాంగణానికి వెనుకవైపు ఉంటుంది.దేవాలయంనుంచి చూస్తే అలిపిరి మెట్లదారి ,రాతికోటగోడలా ఉన్న తిరుమల గిరుల దృశ్యం నయనానందకరంగా ఉంటుంది .అక్కడే రామకృష్ణ మఠం కూడా ఉంది.
తర్వాత గోవిందరాజస్వామి వారి గుడి దగ్గరున్న తిరుమల తిరుపతి దేవస్థానం నందు పుస్తకాలు కొనాలని వెళ్ళాను. అక్కడ మా స్నేహితుని కోసం చతుర్వేద సంహితను, తీసుకున్నాను. నాకోసం భాగవతం సెట్ ను(ఐదు పుస్తకాలు ) తీసుకున్నాను. ఈ పుస్తకాలను దేవస్థానంవారు 50 శాతం రాయితీతో అందజేస్తున్నారు. చతుర్వేద సంహిత వాస్తవధర 1600 రూపాయలైతే 800 రూపాయలకు ,భాగవతం 410 రూపాయలకూ ఇస్తున్నారు.
చతుర్వేద సంహిత గురించి కొన్ని విషయాలు మీకు తెలియచేయాలనుకుంటున్నాను.
చతుర్వేద సంహిత ఋగ్యజుస్సామాథర్వవేదముల మూలమంత్రములు, ఋషి, దేవత, చందస్సు,స్వరము, మంత్రానుక్రమణికలతో చతుర్వేద భూమికా సహితము
లిప్యనువాదకులు, సంపాదకులు, పరిశోధకులు, సిద్ధాంతాలంకార, విద్యాభూషణ, ఆర్షవిద్యా వినోద ఆచార్య డా.మర్రి కృష్ణారెడ్డి ఎం.ఏ,ఎం.ఎడ్,పి.హెచ్.డి మహబూబ్ నగర్ కొందుర్గు మండలం, రావిర్యాల గ్రామం.
ప్రకాశకులు వైదిక సాహిత్య ప్రచార సమితి(రిజిష్టర్డ్), హైదరాబాద్ 500060
ఫోన్. 040 24051322, 9849583929
వేదములనూ, వేదభాష్యములనూ విస్తృతస్థాయిలో ముద్రించు యత్నం ఇంతకుపూర్వం ఏ సంస్థనుండియు, ఏవ్యక్తినుండియూ జరుగలేదు.
భారతీయ విజ్ఞాన సంపదకు మూలకందములనదగిన వేదముల రహస్యములు, సారాంశములు ఆంధ్రజగద్వ్యాప్తము చేయవలయుననే సత్సంకల్ఫముతో ఈ కార్యక్రమమునకు పూనుకున్నామని ప్రకాశకులు తెలియజేస్తున్నారు. కావున భారతీయ సంస్కృతికి ఆధారములైన వేదసాహిత్య ముద్రణ ద్వారా వేదధర్మప్రచారానికి అధికాధిక ధనమును వెచ్చించి ఈ వైదిక సాహిత్య ప్రచార సమితి (రి) అను సంస్థను ప్రోత్సహించవలసినదిగా కోరుచున్నారు.
ఈ వేద సాహిత్యం విక్రయం ద్వారా, దాతలద్వారా వచ్చు ధనము వేదముద్రణ మరియు వేదధర్మ ప్రచారమునకే వ్యయం చేయబడునని తెలియజేస్తున్నారు. ధార్మికులైన వారు ఈ వేదప్రచారోద్యమానికి త్రికరణశుద్ధిగా తను మనో ధనములతో సహకరించి సాక్షాత్ వేద స్వరూపుడైన అ పరమేశ్వరుని కృపకు పాత్రులై ఆయురారోగ్యైశ్వర్యాదులు బొంది ఈ జన్మలో సుఖసంతోషాలను, పరజన్మలో సద్గతులను పొందగోరుచున్నామని తెలియజేస్తున్నారు. పదివేల రూపాయలు సమర్పించినవారికి వేదగిరిలో వారి పేరును లిఖించడంతో పాటు 16వేల ఖరీదు గల పుస్తకాలనూ బహూకరిస్తామని తెలుపుతున్నారు.
తిరుపతి ఇస్కాన్ దేవాలయ చిత్రాలకోసం ఇక్కడ చూడండి.
ఇస్కాన్ దేవాలయాల వీడియోలకోసం ఇక్కడ చూడండి.
పూర్ణాహుతి కి రండి ..పరమశివుని కరుణ పొందగా ...
7 hours ago

6 comments:
అనంతపురం ఇస్కాన్ చూశారా?
ప్రారంభోత్సవరోజునే వెళ్ళాను తర్వాత మళ్ళీ ఫిబ్రవరిలో వెళ్ళాను
రవి అనంతపురం ఇస్కాన్ కోసం ఈ టపా చూడండి.http://vijayamohan59.blogspot.com/2009/02/blog-post_23.html
ఆ టపా ఇదివరకే చూశాను. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత గుర్తొచ్చింది. దానితో బాటు నా టపా కూడా ఒకటి గుర్తొచ్చింది.
ముందుగా మీకూ, మీ శ్రీమతిగారికీ, వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఆ భగవంతుని కృపా కటాక్ష వీక్షణాలు మీమీద ఎల్లప్పుడూ వుండాలని కోరుకుంటున్నాను.
ఇస్కాన్ టెంపుల్స్ ఎక్కడైనా బాగుంటున్నాయి. కారణం వారి శ్రధ్ధ, వ్యయం అనుకుంటాను.
అమెరికాలో డెట్రాయిట్ ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో జరిగిన జగన్నాధ రధ యాత్ర గురించి నా పోస్టు చదవండి.
psmlakshmi
psmlakshmi.blogspot.com
లక్ష్మి గారికి ధన్యవాదములు
Post a Comment