Wednesday, December 31, 2008

నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు

తిరుప్పావై --పదహారవ పాశురము


నాయగనాయ్ నిన్ర నన్దగోపనుడైయ
కోయిల్ కాప్పానే ! కొడిత్తోన్రుమ్ తోరణ
వాశల్ కాప్పానే ! మణిక్కదవమ్ తాళ్ తిరవాయ్
ఆయర్ శిరుమియరోముక్కు అరై పరై
మాయన్ మణివణ్ణన్ నెన్నెలేవాయ్ నేర్ న్దాన్
తోయోమాయ్ వన్దోమ్ తుయిలెళప్పాడువాన్
వాయాల్ మున్నమున్నమ్ మాత్తాదే అమ్మా! నీ
నేశ నిలైక్కదవమ్ నీక్కేలో రెమ్బావాయ్.

నందుని భవన ద్వారపాలకుని గోదాదేవి ప్రార్థించడం

మా నాయకుడైన నందగోపుని భవనానికి కావలివున్న ద్వారపాలకస్వామీ ! మకరతోరణాదులు చెక్కబడి పతాకాలతో అందంగా కనపడుతున్న రతనాల వాకిలి గడియతీసి తలుపులు తెరచిపెట్టు. మేము యదువంశంలో పుట్టిన అమాయకమైన భామలం! విచిత్రమైన మాయగాడు, నీలమణుల వంటి శరీరచ్ఛాయగలిగిన ఆ నల్లని కన్నయ్య, మాకు ఒక వాద్యాన్ని ( వరాన్ని )
ఇస్తానని నిన్ననే బాసచేసి ఇక్కడికి రమ్మని చెప్పినాడు. అందువల్ల ఈ వేకువజామున మేలుకొలుపు మంగళగీతాలను చక్కగా గానం చేస్తూ ఆ కృష్ణమూర్తిని నిద్ర లేపటానికి వచ్చివున్నాం. ఓ ద్వారపాలకా ! తొలుదొల్తనే మమ్ము నోటితో వారించకు. దయచేసి తలుపు తెరువు. మేము వ్రతం ఆచరించవలసి వుంది.

శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం తిరుమలలో తిరుప్పావై నుంచి

తిరుప్పావైపై మంజులశ్రి గారి ప్రవచనాలగురించి చూడండి

http://teluguone.com/bhakti/tiruppavai/index.jsp?filename=centerframe1.htm


Tuesday, December 30, 2008

తిరుప్పావై --పదిహేనవ పాశురము


ఎల్లే యిలంగిళియే ! యిన్నమురంగుడియో?
శిల్లెన్రళై యేన్మిన్? నజ్ఞ్గైమీర్, పోదరుగిన్రేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పణ్డేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీజ్ఞ్గళే, నానేదా నాయుడుగ
ఒల్లైనీ పోదాయ్, ఉనక్కెన్న వేఱుడైయై ?
ఎల్లారుమ్ పోన్దారో? పోన్దార్, పోన్దెణ్ణిక్కొళ్
వల్లానై కొన్రానై మాత్తారై మాత్తళిక్క
వల్లానై మాయనై ప్పాడేలో రెమ్బావాయ్.



ఒక కీరవాణిని మేల్కొల్పుట
( ఇది సంభాషణ రూపంలో సాగినది )


చెలికత్తెలు ఓసీ ! చిలుకపలుకుదానా ! ఇంకను నిద్రిస్తూ వున్నావా !

కీరవాణి ష్, వళ్ళు అదరేట్లు ఏమిటా అరుపు ! ఇదే లేచి వస్తున్నా .

చెలికత్తెలు చతురవాక్కులు కలదానా ! నీ నోరు మాకు తెలియదా !

కీరవాణి సరే కానీ, నేను రాలేదని అంటున్నారు కాని,
అందరూ వచ్చినారా !

చెలికత్తెలు అందరూ వచ్చినారు. నీవే వచ్చి లెక్కించుకో ! కువలయాపీడమనే మత్తగజాన్ని సంహరించినవాడూ, కంసారి, శత్రుమర్దనుడు, మహామాయగాడు అయిన శ్రీకృష్ణుని లీలల గూర్చి నోరారా కీర్తిద్దాం. ఈ వ్రతానికి మమ్ము అనుసరించు.


శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం తిరుమలలో తిరుప్పావై నుంచి

తిరుప్పావైపై మంజులశ్రి గారి ప్రవచనాలగురించి చూడండి

http://teluguone.com/bhakti/tiruppavai/index.jsp?filename=centerframe1.htm




ఇడిగిడిగో మా ఇంట జన్మించిన చిన్నికృష్ణుడు

Monday, December 29, 2008

తిరుప్పావై --పదునాలుగవ పాశురము

ఉజ్ఞ్గల్ పుళైక్కడై తోట్టత్తు వావియుల్
శెజ్ఞ్గళునీర్ వాయ్ నెగిలి న్దాంబల్ వాయ్ కూంబినకాణ్
శెజ్ఞ్గల్పొడిక్కూరై వెణ్ పల్ తవత్తవర్
తజ్ఞ్గల్ తిరుక్కోయిల్ శజ్ఞ్గిడువాన్ పోగిన్రార్
ఎజ్ఞ్గలై మున్న మెళుప్పువాన్ వాయ్ పేశుమ్
నజ్ఞ్గా యెలున్దిరాయ్ నాణాదాయ్ నావుడై యాయ్
శజ్ఞ్గొడు శక్కర మేన్దుమ్ తడక్కైయన్
పజ్ఞ్గయక్కణ్ణానై ప్పాడేలో రెమ్బావాయ్.

వెలుగురేకలు విచ్చుకున్నవి, లేవమ్మా! లే !

కన్యకామణీ ! మమ్ము మేల్కొలుపుతానాని బీరాలు పలికి నీవే ఆదమరచి నిద్రిస్తున్నావా ! ఏమిటీ ? ఇంకా తెల్లవారలేదని బుకాయింపు మాటలు సిగ్గులేకుండా పలుకుతున్నావా? అటుచూడు మీ ఇంటి పెరడు కొలనులోని ఎర్రతామరలు వికసించాయి ! నల్లకలువలు ముడుచుకొన్నాయి ! అటు వీధిలో కాషాయాంబరధారులైన సన్యాసులు దేవాలయం తలుపులు తెరచుటకై తాళాల గుత్తులను తీసుకొనిపోతున్నారు. మమ్ములను లేపెదనని మాటలు చెప్పినదానవు కొంచెమైనా బిడియం లేకుండా ఇంకా నిద్రిస్తున్నావా ? శంఖ చక్రాలు ధరించిన, పద్మాలవంటి కన్నులుగలవాడైన శ్రీ కృష్ణభగవానుని లీలల గూర్చి నోరార గానం చేయడానికి నిద్రలేచిరావమ్మా ! ఇది మన వ్రతం కదా

!
శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం తిరుమలలో తిరుప్పావై నుంచి

తిరుప్పావైపై మంజులశ్రి గారి ప్రవచనాలగురించి చూడండి

http://teluguone.com/bhakti/tiruppavai/index.jsp?filename=centerframe1.htm


Sunday, December 28, 2008

తిరుప్పావై --పదమూడవ పాశురము


పుళ్ళిన్ వాయ్ కీణ్డానై పొల్లావరక్కనై
క్కిళ్ళి క్కళైందానై క్కీర్తిమై పాడిప్పోయ్
ప్పిళ్ళైగళెల్లారుమ్ పావైక్కళమ్ బుక్కార్
వెళ్ళి యెళున్దు వియాళ ముఱజ్ఞ్గిత్తు
ప్పుళ్ళుమ్ శిలుంబినకాణ్ , పోదరిక్కణ్ణినాయ్
కుళ్ళక్కుళిరక్కుడైన్దు నీరాడాదే
పళ్ళిక్కి డత్తియోపావాయ్ ! నీ నన్నాళాల్
కళ్ళమ్ తవిర్ న్దు కలన్దేలో రెమ్బావాయ్.

మరో సుందరాంగిని మేల్కొల్పడం

ఓ గోపికా ! బకరాక్షసుణ్ణి చీల్చిచెండాడిన శ్రీకృష్ణభగవానుని, రావణాసురుని సంహరించిన శ్రీరామచంద్రుని కల్యాణగుణలీలలను ప్రకటించే పాటలను పాడుకొంటూ మనకంటే చిన్నవయసుగల కన్యకలు అందరూ నోము నోచే చోటికి వెళ్ళి చేరారు. తెలతెలవారుతూవుంది. శుక్రుడు ఉదయించి బృహస్పతి అస్తమించాడు. గూళ్ళను వదలిన పక్షులు రొదచేస్తూ ఆహారం కొరకు ఎగిరిపోతున్నాయి. పద్మములవంటి, జింకవంటి అందమైన కన్నులు కలదానా ! చన్నీట జలకాలాడ తగిన సమయంలో ఇంకా పానుపుపై నిదిరిస్తున్నావా ? ఈ శుభదినాన ఇంకా నిద్రేల ? మేలుకో, కపటం మాని మాతో కలు, జాగు చేయకు, వ్రతమాచరించడానికి మాతోరా !

శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం తిరుమలలో తిరుప్పావై నుంచి

తిరుప్పావైపై మంజులశ్రి గారి ప్రవచనాలగురించి చూడండి

http://teluguone.com/bhakti/tiruppavai/index.jsp?filename=centerframe1.htm


Saturday, December 27, 2008

తిరుప్పావై --పన్నెండవ పాశురము


కనైత్తిళం కట్రెరుమై కన్రుక్కిరంగి
నినైత్తుములై వళియే నిన్రుపాల్ శోర,
ననైత్తిలమ్ శేరాక్కుమ్ నర్ చెల్వన్ తంగాయ్
పనిత్తెలై వీళ నిన్ వాశల్ కడైపట్రి
శినత్తినాల్ తెన్నిలజ్ఞ్గైక్కోమానైచెట్ర
మనత్తుక్కినియానై ప్పాడవుమ్ నీవాయ్ తిఱవాయ్
ఇనిత్త నెళున్దిరాయ్ ఈదెన్న పేరుఱక్కమ్
అనైత్తిల్లత్తారు మఱిన్దేలో రెమ్బావాయ్.

కృష్ణుని నేస్తమైన ఒక సంపన్నుని చెల్లెల్ని మేల్కొల్పడం

ఓ గోపికామణీ ! తాళ్ళతో కట్టివేసిన దూడల అరుపువిని, వాటిమీద వాత్సల్యంచేత పొదుగులు చేపి, వాటినుండి పాలు కారిపోవడంవల్ల ఇంటి ముంగిట బురద బురదగా అయిన పశుసంపద వృద్ధిపొందిన గోపకునికి చెల్లెలైనదానా ! తలలపైన కురిసే మంచువల్ల తడుస్తూ నీ ఇంటి ముంగిట కాచుకొనివున్నాం. తన సతిని చెరబట్టిన లంకేశుని చంపినట్టి శ్రీరామచంద్రుని గూర్చి పాడుతున్న మమ్ము చేరరావే ! చేరి నీవు నోరారా పరమగానం చెయ్యవే ! మేము నీకై వచ్చి రామనామం చేస్తున్నా వినీకూడ రాకున్నావటే ! ఇది ఏమి విడ్డూరం ! ఇకనైనా మేల్కొని మాతో వ్రతాచరణకు రావలసింది.

తిరుప్పావైపై మంజులశ్రి గారి ప్రవచనాలగురించి చూడండి

http://teluguone.com/bhakti/tiruppavai/index.jsp?filename=centerframe1.htm


Friday, December 26, 2008

తిరుప్పావై --పదకొండవ పాశురము


కట్రుక్క ఱ వైక్కణంగళ్ పలక ఱన్దు
శట్రార్ తి ఱలళియచ్చెన్రు శెరుచ్చెయ్యుమ్
కుట్రమొన్రిల్లాద కోవలర్తమ్ పొర్కొడియే
పుట్రరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుట్రత్తుతోళిమా రెల్లారుమ్ వన్దునిన్
ముట్రమ్ పుహున్దు ముగిల్వణ్ణన్ పేర్పాడ
శిట్రాదే పేశాదే శెల్వప్పెణ్ణాట్టి ! నీ
ఎట్రుక్కు రంగమ్ పొరుళేలో రెమ్బావాయ్.


సుగుణాలరాశి, అందాలకుప్ప అయిన ఒక గోపికను మేల్కొల్పడం

ఓ గోపికామణీ ! ఒకవైపు దూడలతో గూడియుండు ఆవుల బరువైన పొదుగులనుండి పాలుపితుకుతూ, మరోవైపు శత్రువుల బలాన్ని నశింపచేసే ధైర్యసాహసాలతో విలసిల్లుతూ, దోషరహితులైన యదువీరుల ఇంటిలో పుట్టిన బంగారుతీగవు నీవు ! పుట్టనుండి వెడలు పాముపడగవంటి జఘనభాగము కలిగిన అందాలభరణివే నీవు ! వనమయూరము వంటి చాయ కలిగిన వన్నెలాడీ ! లేచిరమ్ము. చుట్టుపక్కలనున్న మన నేస్తులందరూ నీవాకిటి ముందరికి వచ్చి, నీలమేఘశ్యాముడగు శ్రీకృష్ణుని నోరార గానం చేస్తున్న, నీవు ఉలకవు పలుకవు. లక్ష్మీకరములైన శుభలక్షణాలు కల నీవు ఇంకా నిద్రించడం తగని పని. వెంటనే లేచి వ్రతాచరణమునకు మమ్ము అనుసరించవలసింది

శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం తిరుమలలో తిరుప్పావై నుంచి

తిరుప్పావైపై మంజులశ్రి గారి ప్రవచనాలగురించి చూడండి

http://teluguone.com/bhakti/tiruppavai/index.jsp?filename=centerframe1.htm


Thursday, December 25, 2008

తిరుప్పావై-- పదవ పాశురము


నోట్రుచ్చువర్కమ్ పుహిగిన్రవమ్మనాయ్
మాట్రముమ్ తారారో వాశల్ తిరవాదార్
నాట్రత్తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాల్
పోట్రప్పరైత్తరుమ్ పుణ్ణియనాల్,పణ్ణొరునాళ్,
కూట్రత్తిన్ వాయ్ విళన్ద కుమ్బకరుణనుమ్
తోట్రు మునక్కే పెరున్దుయిల్ తాన్ తన్దానో ?
ఆట్రవనన్దలుడై యా యరుంగలమే
తేట్రమాయ్ వన్దు తిరవేలో రెమ్బావాయ్

శ్రీకృష్ణునితో ఎక్కువ చనువు గల్గిన గోపికను మేల్కొల్పడం

ఓ చెలీ ! మంచి నోము నోచి స్వర్గసుఖాలు అనుభవించుచున్నదానా ! తలుపు బిగించి పడుకొంటివేమే ? తలుపు తియ్యవే ? పోనీలే తలుపు తియ్యకున్నా పరవాలేదు. ఒక్క మాటైనా నోటితో పలుకరాదా ! నీతోడి ఒక్కమాటకైనా మేము నోచుకోలేదా ! కుంభకర్ణుడు నీతో ఓడిపోయి తన నిద్రను నీకిచ్చి వెళ్ళాడేమోగదా ! అందుకే అంత మొద్దునిద్ర నీకు ఆవహించింది. దివ్యపరిమళభరితమగు తులసీమాలలను ధరించివున్న శ్రీమన్నారాయణుణ్ణి కీర్తించినట్లయితే మనకు కావలసిన కోరికలిస్తాడు. మా గోపికాబృందమునకు అలంకార ప్రాయమైనదానా ! ఇకనైనా తెలివి తెచ్చుకొని నిద్దురలేచి తలుపు తెరు ! ఈ వేకువన మనమందరం వ్రతమాచరిద్దాం.

శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం తిరుమలలో తిరుప్పావై నుంచి

తిరుప్పావైపై మంజులశ్రి గారి ప్రవచనాలగురించి చూడండి

http://teluguone.com/bhakti/tiruppavai/index.jsp?filename=centerframe1.htm


Wednesday, December 24, 2008

మా ఇంట చిన్ని కృష్ణుడు జన్మించాడు--దృశ్యరూపం
















ఈ రోజు అనగా 24 12 08 తేదీ నాడు మా ఇంట చిన్ని కృష్ణుడు జన్మించాడు. పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఈ ఉదయం 9.30 –9.40 మధ్య సమయంలో మా అమ్మాయి చిన్ని కృష్ణుణికి జన్మనిచ్చింది.

తిరుప్పావై--తొమ్మిదవ పాశురము



తూమణి మాడత్తుచ్చుట్రుమ్ విళక్కెరియ
ధూపమ్ కమళ త్తుయిలణై మేల్ కణ్ వళరుమ్
మామాన్ మగళే ! మణిక్కదవమ్ తాళ్ తిరవాయ్
మామీర్! అవళై యెళుప్పీరో ఉన్ మగళ్ దాన్
ఊమైయో ? అన్రిచ్చెవిడో ? అనన్దలో
ఏ మప్పెరున్దుయిల్ మన్దిరప్పట్టాళో ?
మామాయన్ మాధవన్ వైకున్దన్ ఎన్రెన్రు
నామమ్ పలవుమ్ నవిన్రేలో రెమ్బావాయ్



శ్రీమంతురాలైన ఒక గోపికను మేల్కొల్పడం


ఓ మామ కూతురా ! నిదురలేవమ్మా! మాణిక్య భవనంలో మాణిక్య దీపాల వింతవింత కాంతుల్లో కమ్మని ధూపసువాసనలమధ్య సుతిమెత్తని పడకపై నిద్రిస్తున్నదానా ! నిద్ర లేవరాదటే! మణివాకిలి గడియ తియ్యరాదటే ! అత్తా ! నీబిడ్డను నీవైనా నిద్రలేపు. మా మాటలు వినపడినట్లులేదు. చెవిటిదా ? ఏమి మాట్లాడటం లేదు మూగదా ? లేక మాటామంతీ లేక నిదురపోవునట్లు మందుగాని మంత్రంగానివేసినారా !
గొప్ప గొప్ప మాయలు (లీలలు) చేసేవాడా, మాధవా, వైకుంఠనాథుడా అని వేయి విధాల నోరారా స్వామివారిని గూర్చి మేమందరం గానం చేస్తున్నా కూడా నీ కూతురు నిదుర లేవలేదు. దయచేసి మా వ్రతాచరణకు మీ ముద్దుల కూతురిని నిద్దురనుండి లేపండి.

శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం తిరుమలలో తిరుప్పావై నుంచి

తిరుప్పావైపై మంజులశ్రి గారి ప్రవచనాలగురించి చూడండి

http://teluguone.com/bhakti/tiruppavai/index.jsp?filename=centerframe1.htm




Tuesday, December 23, 2008

తిరుప్పావై --ఎనిమిదవ పాశురము


కీళ్ వానమ్ వెళ్ళెన్రు ఎరుమై శిరువీడు
మేయ్ వాన్ పరన్దనకాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్
పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తున్నై
కూవువాన్ వన్దు నిన్రోమ్ కోదుకలముడైయ
పావాయ్ ! ఎళున్దిరాయ్ పాడిప్పరైకొణ్డు
మావాయ్ ! పిళన్దానై మల్లరై మాట్టియ
దేవాదిదేవనై చ్చెన్రునామ్ శేవిత్తాల్
ఆవావెన్రా రాయ్ న్దరుళేలో రెమ్బావాయ్.

స్వామి సేవయందు ఆసక్తికల యువతిని మేల్కొల్పడం

ఓ యువతీ ! మేల్కొనవే ! తూర్పున ఆకాశం తెల్లబడింది. పచ్చిక బయళ్ళలో మంచుచే కప్పబడిన పచ్చికను మేస్తూ పశువులు స్వేచ్చగాతిరుగాడుతున్నాయి. స్వామివారిని దర్శించే కోరికతో నిన్ను లేపకుండానేవెళ్ళేవారిని దారిలోనే ఆపివుంచి నిన్ను పిలుచుటకై మేము వచ్చి నిలిచివున్నాము. శ్రీ కృష్ణుని సేవయందు ఆసక్తికల ఓ సుందరాంగీ మేలుకో ! మేలుకొని మాతో కలిసి పూజకు రావలసినది. చాణూర ముష్టికులనే పేరుగల మల్లవీరులను మట్టుపెట్టి విలసిల్లు విష్ణుమూర్తిని జేరి పరిపరి విధముల పరమగానములతో కీర్తించినచో ఆ స్వామి అయ్యో వీరు ఇందరు వచ్చినారే అని అత్యంత కరుణతో మనలను అనుగ్రహిస్తాడు. కనుక ఓ గోపికా ! మేలుకొని వ్రతాచరణకు మమ్ము అనుసరించవమ్మా !

శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం తిరుమలలో తిరుప్పావై నుంచి

తిరుప్పావైపై మంజులశ్రి గారి ప్రవచనాలగురించి చూడండి

http://teluguone.com/bhakti/tiruppavai/index.jsp?filename=centerframe1.htm


Monday, December 22, 2008

తిరుప్పావై--ఏడవ పాశురము


కీశు కీశెన్రెజ్ఞ్గుమానై చాత్తకలన్దు !
పేశిన పేచ్చరవమ్ కేట్టిలైయో ! పేయ్ ప్పెణ్ణే !
కాశుమ్ పిరప్పుమ్ కలగలప్పక్కై పేర్తు
వాశ నరుజ్ఞ్గుళ లాయిచ్చియర్ మత్తినాల్
ఓశై పడుత్త తయిర రవమ్ కేట్టిలైయో
నాయకప్పెణ్ణిళ్ళాయ్ ! నారాయణన్ మూర్తి
కేశావనై ప్పాడవుమ్ నీకేట్టే కిడత్తియో
తేశ ముడైయాయ్ ! తిర వేలో రెమ్బావాయ్.

నోము విషయం తెలిసీ నిద్రిస్తున్న నాయకిని మేల్కొల్పడం

ఓ యువతీ ! మాకు నాయకివై, నోము నోచు విషయం అంతా తెలిసీ ఇంకా నిద్రిస్తున్నావా ? ఎంత విడ్డూరం ! ఇంకా తెల్లవారనే లేదంటావా ! భలేదానివే ! అదిగో భరద్వాజ జంటపక్షులు రాత్రి అంతా కలిసివుండి ఆహారం కొరకు విడిపోతూ కీచుకీచుమని రొదచేయడం నీకు వినపడాలేదా ! పోనీలే, ఓ చిన్నదానా ! గోపికలు వేకువనే లేచి పెరుగు చిలుకుట నీకు కనపడకపోవచ్చు. చిలుకునప్పుడు వారి మెడలో మంగళసూత్రంలోని రెండు తాళిబొట్లు, కాసులపేరులు రాచుకొని కలిగే చప్పుళ్ళు, చేతిగాజుల గలగలలు నీ చెవికి వినపడనేలేదా ! మజ్జిగ చిలికేటప్పటి చిర్రుబుర్రుమనే మనోహర శబ్దమైనా వీనుల విందుగా వినగరాలేదా ! మాకు నాయకివైన చిన్నదానా! పరంధాముడైన, సర్వార్థసాధకుడైన శ్రీ కేశవస్వామిని స్తుతిస్తూ పరమగానం చేస్తుండగా నీవ్ వింటూ కూడ నిదురలో ఉన్నావా ! ఇకనైనా వేగిరమే మేలుకో ! మనమంతా వ్రతమాచరించాలిగదా !

శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం తిరుమలలో తిరుప్పావై నుంచి

తిరుప్పావైపై మంజులశ్రి గారి ప్రవచనాలగురించి చూడండి

http://teluguone.com/bhakti/tiruppavai/index.jsp?filename=centerframe1.htm




Sunday, December 21, 2008

వేణుగోపాలుడు --బొమ్మ


తిరుప్పావై ---ఆరవ పాశురము


పుళ్ళుమ్ శిలుంబినకాణ్ పుళ్ళరయ్యన్ కోయిలిల్
వెళ్ళై విళిశంగిన్ పేరరవమ్ కేట్టి లైయో
పిళ్ళా యెళుంది రాయ్ పేయ్ ములై నంజుణ్డు
కళ్ళచ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిల మర్ న్ద విత్తినై
ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుమ్ యోగిగళుమ్
మెళ్ళ వెళున్దు ఆరియన్ర పేరరవమ్
ఉళ్ళమ్ పుగున్దు కుళిర్ న్దేలో రెమ్బావాయ్.


గోదాదేవి నోము తెలియని కన్నియను మేల్కొల్పడం

ఓ చెలీ ! ఇంకనూ నిద్రమత్తులో జోగుతున్నావా ! లెమ్ము త్వరత్వరగా లెమ్ము. మేల్కొనుము. ఈ వేకువజామున పక్షిజాలమంతా కూతలు పెడుతూ తమ గూళ్ళను వదలిపెట్టి పోతున్నాయి. ఈ ప్రశాంత సమయంలో గరుడవాహనుడైన శ్రీ స్వామివారిని మేల్కొల్పే ఆలయ శంఖధ్వని నీ చెవులకు వినపడనే లేదా ! ఓ చిన్నదానా మేల్కొనుము . చనుబాలు తాగి పూతనను సంహరించినవాడు, తన చిన్ని పాదములచే శకటాసురుణ్ణి భంజించినవాడు అయిన నందబాలుణ్ణి గూర్చి పాడుతున్న పరమగానములు వీనుల విందుగా వినుము. జలధిలో అనంతుడనే శేషునిపై యోగనిద్రలో శయనించిన జగన్నాథుని గూర్చి, ఈ వేకువన నిద్ర మేల్కొన్న మునులు, పరమయోగులు హరి హరీ అని ఆహ్లాదంగా,ఆనందంగా వారు చేస్తున్న నామ సంకీర్తనం నీకు వినరాలేదా ! ఓ బాలా ! ఇకనైనా త్వరగా మేల్కొనుము. మనం వ్రతం ఆచరించవలె గదా !

శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం తిరుమలలో తిరుప్పావై నుంచి

తిరుప్పావైపై మంజులశ్రి గారి ప్రవచనాలగురించి చూడండి

http://teluguone.com/bhakti/tiruppavai/index.jsp?filename=centerframe1.htm


Wednesday, December 17, 2008

తిరుప్పావై--ఐదవ పాశురము


మాయనై మన్ను, వడమదురై మైన్దనై
త్తూయ పెరునీర్ యమునై త్తురైవనై
ఆయర్ కులత్తినిల్ తోన్రుమ్ మణి విళక్కై
త్తాయైక్కుడల్ విళక్కమ్ శెయ్ద దామోదరనై
తూయోమాయ్ వన్దునామ్ తూమలర్ తూవిత్తొళుదు
వాయినాల్ పాడి, మనత్తినల్ శిన్దిక్క
పోయపిళ్ళైయుమ్ ప్పుగుదరువా నిన్రనవుమ్
తీయినిల్ తూశాగుం శెప్పేలో రెమ్బావాయ్.

శ్రీకృష్ణ నామ గానంతో సర్వపాపహరణం

మాయగాడై తిరుగుతూ ఉత్తరమధురను కాచునట్టి వాడూ, గోపికలతోగూడి యమునాతీరంలో విహరించేవాడూ, గోకులంలో జన్మించి తల్లి కడుపును పండించినవాడూ, అయిన గోపాలకృష్ణుని మనమందరం మంచి మనస్సుతో సమీపించి, దాసానుదాసులమై పూలతో పూజించుదాం. నోరారా గానంచేస్తూ భక్తిభావంతో ధ్యానిస్తే, ఇటు గతంలో చేసిన పాపాలూ అటు భవిష్యత్తులో రాగల పాపాలు అన్నీ అగ్నికి తగిలిన దూదివలె కాలిపోతాయి. కనుక గోవిందుని కల్యాణ గుణ లీలా విశేషాలను, శ్రీనామాలను గానం చేయటమే ఉత్తమం. ఇదే కదా మన వ్రతం.

శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం తిరుమలలో తిరుప్పావై నుంచి

తిరుప్పావైపై మంజులశ్రి గారి ప్రవచనాలగురించి చూడండి

http://teluguone.com/bhakti/tiruppavai/index.jsp?filename=centerframe1.htm




తిరుప్పావై--నాలుగవ పాశురము


4.పాశురము

ఆళిమళైక్కణ్ణా ! ఒన్రు నీకై కరవేల్
ఆళియుళ్ పుక్కు ముగున్దు కొడార్తేరి
ఊళిముదల్వ నురువమ్పోల్ మెయికరుత్తు
పాళియందోళుడై పర్పనాబన్ కైయిల్
ఆళిపోళ్ మిన్ని, వలమ్బురి పోల్ నిన్రదిరిన్దు
తాళాదే శార్ జ్ఞ్గముదైత్త శరమళైపోల్
వాళవులగినిల్ పెయ్ దిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళిన్దేలో రెమ్బావాయ్

వర్షం కోసం మేఘునికి విన్నపం

ఓ వానదేవుడా ! మేము చేయబోవు ఈ వ్రతానికి నీరు చాలా అవసరం. ఆ నీటిని నీవు సమృద్ధిగా కురిపించవలసింది. మరి నీళ్ళు నీకెక్కడివంటావా ! సముద్రానికి వెళ్ళు. వెళ్ళి సముద్రంలోని నీళ్ళను గొంతువరకు తృప్తిగా తాగి గర్జిస్తూ నింగికెగురు. విష్ణువు యొక్క నల్లని శరీరంవలె నీవునూ నల్లని చాయను పొందు. జలధిశాయి ధరించిన చక్రకాంతివలె మెరుపులతోను, శంఖధ్వనివలె ఉరుములతోను, శార్ జ్ఞ్గము నుండి వెలువడిన తీవ్రమైన శరపరంపరవలె సంతత వర్షధారలతో లోకాలన్నీ ఆనందించేటట్లు వర్షించు. గోవిందుని పొందగోరు మేమంతా ఈ మార్గశిరమాసంలో నీట జల్లులాడి వ్రతం ఆచరిస్తాం.

శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం తిరుమలలో తిరుప్పావై

తిరుప్పావైపై మంజులశ్రి గారి ప్రవచనాలగురించి చూడండి

http://teluguone.com/bhakti/tiruppavai/index.jsp?filename=centerframe1.htm


తిరుప్పావై--మూడవ పాశురము


3.పాశురము.

ఓంగి యులగళన్ద ఉత్తమన్ పేర్పాడి
నాంగళ్ నమ్బావైక్కు చ్చాట్రి నీరాడినాల్
తీంగన్రి నాడెల్లామ్ తింగళ్ ముమ్మారి పెయ్ దు
ఓంగు పెరుమ్ శెన్నెల్ ఊడు కయలుగళ
పూంగువళై పోదిల్ పొరివణ్డు కణ్పడుప్ప
తేంగాదే పుక్కిరున్దు శీర్ త్తములై పట్రి
వాంగక్కుడమ్ నిరైక్కుమ్ వళ్ళల్ పెరుమ్బశుక్కళ్
నీంగాదశెల్వమ్ నిరైన్దేలో రెమ్బావాయ్.

నోము నోచడడంవల్ల లోకానికి కలిగే మేలు

మూడు అడుగులతో ముల్లోకాలను ఆక్రమించిన పురుషోత్తముని నోరారా కీర్తిస్తూ సంకల్పం చెప్పుకొని, నోముపట్టి చన్నీట స్నానం చేస్తే శుభాలు కలుగుతాయి. పాపాలు తొలగుతాయి. రోగాలు, దుర్భిక్ష తస్కరాది భయాలు ఉండవు. దేశమంతా నెలకు మూడువానలు కురిసి పచ్చని పైర్లు ఏపుగా పెరిగి సమృద్ధిగా పండుతాయి. ఆ సమయంలో ఎగసిపడే చేపలతో నీటికయ్యలూ, మత్తుగా తేనెతాగి నిద్రిస్తున్న తుమ్మెదలతో నిండిన ఎర్రనికలువలు నయన మనోహారంగా దర్శనమిస్తాయి . నిండైన పొదుగులు కలిగి ఎంతసేపు పాలుపితికినా కదలని గోగణాలు వృద్ధి పొందుతూ దర్శనమిస్తాయి. ఇట్టి వ్రతాన్ని మనం ఆచరిద్దాం రారే ! అని ఆండాళ్ తన చెలియలతో చెప్పి పిలుస్తోంది.

శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం తిరుమలలో తిరుప్పావై నుంచి

తిరుప్పావైపై మంజులశ్రి గారి ప్రవచనాలగురించి చూడండి

http://teluguone.com/bhakti/tiruppavai/index.jsp?filename=centerframe1.htm




తిరుప్పావై --రెండవ పాశురము




వైయత్తు వాళ్వీర్గాళ్ నాముమ్ నమ్బావైక్కు
చ్చెయ్యుమ్ కిరిశైగళ్ కేళీరో పార్కడలుళ్
పై యత్తు యిన్ర పరమనడిపాడి
నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోమ్ మలరిట్టు నాముడియోమ్
శెయ్యాదన శెయ్యోమ్ తీక్కురళై చ్చెన్రోదోమ్
ఐయ్యముమ్ పిచ్చైయుమ్ ఆన్దనైయుమ్ కైకాట్టి
ఉయ్యు మారెణ్ణి యుగన్దేలో రెమ్బావాయ్.


గోదాదేవి నోమునకు నియమాలు తెలుపుట

లౌకిక సుఖాలను లెస్సగా పొందుతున్న ఓ గోప కన్నియల్లారా ! పారలౌకిక సుఖాలకై చేసే ఈ వ్రత నియమాలను తెలియండి. వేకువజామునే చన్నీట జల్లులాడి క్షీరదిలో శేషపాన్పుపై పరుండిన పరంధాముని పాదపద్మములను సేవించాలి. ఆ వ్రత సమయంలో పాలూ, నేయీ తాగరాదు. కన్నుల కాటుక పెట్టరాదు. జడలో పూలు ముడువరాదు. చేయరాని పనులు చేయరాదు. చేతనైన పనులు పెద్దలకు చేసిపెట్టాలి. పనికిరాని మాటలతో పరుల నొప్పింపరాదు. పేదసాదలకు తోచినంత దానమివ్వాలి. ఇలాగ ఈ వ్రత నియమాలను పాటిస్తూ పరంధాముని సేవింతము రారే !

విశేషాంశం

జిహ్వ చాపల్యం అణచుకొని ఆ నాలుకతో భగవన్నామాన్ని రుచి చూడవలెననీ, కన్నుల కాటుక పెట్టకుండా, ఆ కన్నులతో దేవుణ్ణి చూడటమనే కాటుక ధరించవలెననీ, జడలో పూలు పెట్టక, శ్రీ స్వామివారి పాదపద్మములను తలలో ధరించవలెననీ, అంటే శిరస్సుతో నమస్కారం చెయ్యవలెననీ, నోరార భగవంతుణ్ణి కీర్తించవలెననీ, చేతులతో పేదసాదలకు ధర్మం చెయ్యవలెననే అంతరార్థాన్ని ఈ పాట భోదిస్తూవుంది.

శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం తిరుమలలో తిరుప్పావై నుంచి

తిరుప్పావైపై మంజులశ్రి గారి ప్రవచనాలగురించి చూడండి

http://teluguone.com/bhakti/tiruppavai/index.jsp?filename=centerframe1.htm


Tuesday, December 16, 2008

తిరుమలలో తిరుప్పావై




తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దినచర్య కౌసల్యా సుప్రజారామా ! పూర్వా సంధ్యా ప్రవర్తతే అను సుప్రభాతంతోనే ప్రారంభమవుతుంది.అయితే ఏడాదిలో ధనుర్మాసం ఒక్క నెలరోజులపాటు మాత్రం తిరుమలస్వామివారికి సుప్రభాతానికి బదులుగా గోదాదేవి ( ఆండాళ్) కీర్తించిన ‘తిరుప్పావై’ పఠనం జరుగుతుంది. ఈ ధనుర్మాసం సాధారణంగా మార్గశిర, పుష్యమాసాల్లో వస్తుంది. అంటే సౌరమానం ప్రకారం డిసెంబరు 15 లేదా 16 తేదీతో ప్రారంభమై జనవర్ 14 లేదా 15 న ముగుస్తుంది.

తమిళ సాహిత్యంలో నాలుగువేల పాటలు (పాశురములు) గల‘ నాలాయిర దివ్య ప్రబంధం’ చాలా ప్రసిద్ధమైంది. దీనిని వైష్ణవభక్తాగ్రేసరులయిన పన్నెండుమంది ‘ఆళ్వారులు’ చెప్పారు. వీరినే దివ్యసూరులనీ, పరమయోగులనీ అంటారు. తమిళ శ్రీ వైష్ణవ సాహిత్యంలో ఈ పరమయోగులు పరవశించి పాడిన పాశుర ప్రబంధాలు వేదాలవలె అత్యంతపవిత్రమైనవిగా పరిగణన పొందుతున్నాయి. అందులో తిరుప్పావై అనే ముప్పది పాశురముల కర్త ‘గోదాదేవి.’ ఈమె ‘పెరియాళ్వార్’అని ప్రసిద్ధి పొందిన ‘విష్ణుచిత్తుని’ పెంపుడుబిడ్డ. తమిళనాడు శ్రీవిళ్ళిపుత్తూరులోని వటపత్రశాయి అయిన శ్రీమహావిష్ణువునకు విష్ణుచిత్తుడు కైంకర్యం చేస్తున్న పూలమాలల్ని ముందుగా తాను ధరించి, మళ్ళీ వాటినే స్వామివారి కైంకర్యానికి పంపినందువల్ల, ఈమెకు ‘ఆముక్తమాల్యద’ అనీ ‘చూడికొడుత్తనాచ్చియార్’ అనీ ప్రసిద్ధమైన పేర్లు వచ్చాయి.

ద్వాపరయుగంలో శ్రీకృష్ణభగవానుణ్ణి భర్తగా పొందవలెననే ఉద్దేశంతో గోపికలు కాత్యాయనీవ్రతాన్ని మార్గశిరమాసంలో చేశారు. అలాగే గోదాదేవికూడా తనను తాను గోపికగా భావించుకొని ధనుర్మాసంలో ( మార్గళి ) ఆ వ్రతాన్ని భక్తితో ఆచరించింది. నెలరోజులపాటు ప్రతిదినం వేకువజామునే శ్రీవిల్లిపుత్తూరులో వేంచేసియున్న వటపత్రశాయి అయిన శ్రీమహావిష్ణువును గూర్చి రోజుకొక్క పాశురాన్ని పరవశించి పరమగానం చేసింది. ఈ వ్రతం ముప్పైరోజులపాటు చేసి చివరకు శ్రీరంగనాథుణ్ణి పరిణయమాడి ఆండాళ్ గా ప్రసిద్ది పొందింది.‘ ఆండాళ్’అనగా భగవంతుణ్ణి వశం చేసుకున్న స్త్రీ అని అర్థం.‘ కోదా’ అంటే మాలిక. పాశురములనే మాలికలచేత భగవంతుణ్ణి కీర్తించింది గనుక ఆమె గోదాదేవి. ఆనాటినుండి ప్రతి ధనుర్మాసంలో శ్రీరంగంలోనే గాక వైష్ణవాలయాలన్నిటిలోన తిరుప్పావై పఠనం అనూచానంగా వస్తున్నది.

ఏకైక స్త్రీ ఆళ్వారుగా ప్రసిద్ధి పొందిన ఆండాళ్ కూడా తిరుమలప్పను దర్శించి

“వెయ్యదోర్ తళలు మిళ్ శక్కెరక్కై
వేంగడ వర్కై విదికిత్తియే”

వేయి వెలుంగులతో ప్రకాశిస్తున్న శంఖ చక్రాలను ధరించిన తిరువేంకటపతికి నేను పూర్తిగా అంకితమైనాని ‘నాచ్చియార్ తిరుమొళి ’లో విన్నవించుకుంది. గోదాదేవి చెప్పిన ఈ అంకితభావాన్ని దృష్టిలో వుంచుకుని భగవద్రామానుజులవారు తిరుమల తిరుపతి ఆలయాల్లో తిరుప్పావై పఠనను ప్రతి ధనుర్మాసంలో అనుష్టింపజేశారు. గోదాదేవి అన్నా, ఆమె చెప్పిన తిరుప్పావై అన్నా రామానుజాచార్యులకు అత్యంత భక్తీ ప్రపత్తీ కూడా.

మనమందరం కూడా ఈ ధనుర్మాసం నెలరోజులూ తిరుప్పావై ప్రతిరోజూ పఠించి శ్రీవేంకటేశ్వరుని అనుగ్రహానికి పాత్రులవుదాం.

తిరుప్పావై

1.పాశురము

మార్గళి త్తిజ్ఞ్గల్ మది నిరైన్ద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్, పోదుమినో నేరిలైయీర్
శీర్ మల్గుమ్ ఆయ్ ప్పాడి శెల్వచ్చిరు మీర్ కాళ్
కూర్వేల్ కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్
ఏరార్ న్ద కణ్ణి యశోదై యిళంశింగమ్
కార్మేనిచ్చజ్ఞ్గణ్ కదిర్మదియం బోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పరైతరువాన్
పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్.

గోదాదేవి నోముకై గోపికలను పిలుచుట

చెలియల్లారా ! రండి రారండీ !
సంపత్కరములయిన సర్వాభరణములతో విరాజిల్లు
తున్న ఓ గోపకన్నియలారా రండీ రారండీ!
ఈ రోజు పవిత్రమయిన మార్గశిరమాసం. అందులోను
పున్నమి వెన్నెల పిండిఆరబోసినట్లు ఉన్న వేకువ
జాము. పోటుమగడైన నందునిఅనుంగుబిడ్డను సేవింతమురారే !
నీలమేఘశ్యాముడు, పద్మనేత్రుడు యశోద
ముద్దుపట్టి అయిన ఆ బాలకిశోరాన్ని సేవించి
తృప్తిదీర సర్వశుభములు పొందుటకు ఈ
వేకువన చన్నీట జల్లులాడి సేవించుటకు
పోవుదము రారే ! ఇది మన వ్రతం కదా !



శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం తిరుమలలో తిరుప్పావై నుంచి

తిరుప్పావైపై మంజులశ్రి గారి ప్రవచనాలగురించి చూడండి

http://teluguone.com/bhakti/tiruppavai/index.jsp?filename=centerframe1.htm


Monday, December 15, 2008

ప్రతిరోజూ ఒక మంచిమాట

ఎవరి స్వార్థం వారు చూసుకోవడం సహజం అనుకుంటాం. ఆ స్వార్థం శ్రుతి మించితేనే సంఘర్షణలూ, సమస్యలూ. సర్వమానవ సౌభ్రాతృత్వం, పరోపకారం, అహింస ఇటువంటివన్నీ ఆకర్షణీయమైన ఆదర్శాలు. ఆచరణలో ఏం జరుగుతుందో చూస్తున్నాం. ప్రభుత్వం మారితే పరిస్థితులు మారతాయనో, మరో దేశానికి వెళితే పరిస్థితులు బావుంటాయనో భావిస్తారు కొందరు. కూపస్థమండూకం కూపాన్ని తనతో తీసుకెళ్ళినట్లు, ఎక్కడి కెళ్ళినా మనుషులు వాళ్ళేగా, మనసులు అవేగా ! సమాజంలో భాగమైన మనలో మార్పురావాలి.
జిడ్డు కృష్ణమూర్తి.

Sunday, December 14, 2008

బలరామకృష్ణులు --బొమ్మ



చ.మరి యొకనా(టి రాత్రి బలమాధవు లుజ్జ్వల వస్త్రమాలికా
ధరులును లేపనాభరణ ధారులునై చని మల్లికాది పు
ష్ప రసనిమగ్న మత్తమధుపంబుల గీతము వించు( దద్వనాం
తరమున వెన్నెలన్ వ్రజనితంబిను లుండ(గ( బాడి రింపుగన్. 1120


తా. మరియొకనాటి వెన్నెలరాత్రి బలరాముడూ, శ్రీకృష్ణుడూ స్వచ్చములైన వస్త్రాలు, పూలదండలూ , సొమ్ములూ ధరించారు. చందనం పూసుకున్నారు. మల్లె మొదలైన విరితేనియలు ఆస్వాదించి మత్తెక్కిన తుమ్మెదల ఝంకారాలు వింటూ బృందావనంలో గోపసుందరులు తమ చుట్టూ పరివేష్టించి ఉండగా మనోహరంగా మధురగీతాలు ఆలపించినారు.


క. ఆ పాట సెవుల సో(కిన, నేపాటియు దేహలతల నెరు(గక దృగ్వా
చా పాటవములు సెడి పడి, రా పాటలగంధులెల్ల నటవీవీథిన్. 1121


తా. రామకృష్ణుల పాట చెవిని బడగానే కలిగొట్టు పూలవంటి దేహపరిమళం కలిగిన గోప వధువులు కన్నూ, నాలుకా మొదలైన యింద్రియాల వ్యాపారం కట్టువడిపోగా ఏ మాత్రమూ ఒడ లెరుగక ఆ వనసీమలో అట్టే పారవశ్యంలో మునిగిపోయారు.

ప్రతిరోజూ ఒక మంచిమాట

జ్ఞాపకాలన్నీ ఆలోచనలే. మనలో ఏయే ఆలోచనలు ఎలా బయలుదేరుతున్నాయో, ఎలా పరిభ్రమిస్తున్నాయో ఎప్పటికప్పుడు నిధానంగా గమనిస్తూంటే అవే తగ్గిపోతాయి.

జ్ఞాపకాల సముదాయమే మనం. ఆలోచనల్ని నిత్యం గమనిస్తూ అవగాహన చేసుకుంటూంటే కొన్ని అవే జారుకుంటాయి. మనస్సు తేలికవుతుంది. జిడ్డు కృష్ణమూర్తి.

Saturday, December 13, 2008

ప్రేమించిన అమ్మాయిల మీద దాడి చేయాలనుకునే ఉన్మాద ప్రేమికులారా

మిమ్మల్ని ప్రేమించలేదని ఆసిడ్ తోనూ, కత్తులతోనూ మీరు ప్రేమించిన అమ్మాయిల మీద దాడి చేయాలనుకునే ఉన్మాద ప్రేమికులారా ఇకమీదట ఈ క్రింది విషయాలను గుర్తుపెట్టుకోండి. మీ కుటుంబానికి రాజకీయ నేపధ్యం ఉందా ? మీకుటుంబంలో ఎవరైనా మంత్రులుగా ఉన్నారా ? మీవాళ్ళెవరైనా పోలీసు యంత్రాంగంలో పనిచేస్తున్నారా ? మీ తల్లిదండ్రులు అవినీతితోనో, లేక మామూలుగానో విచ్చలవిడిగా సంపాదించి మీరేం చేసినా మిమ్మల్ని కాపాడేందుకు డబ్బు ఖర్చు పెట్టగలరా ? మీరు నేరంచేసినా మిమ్మల్ని కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగములో పనిచేసేవారెవరైనా ఉన్నారా ? హాస్టల్ లోచొరబడి అమ్మాయిలను చెడగొట్టి చంపినా రక్షించే వారెవరైనా ఉన్నారా ?
పై అనుకూలతలలో ఏ ఒక్కటి మీకున్నా మీరు ఆసిడ్ బాటిళ్ళతో , కత్తులతో మిమ్మల్ని ప్రేమించని అమ్మాయిలపై దాడి చేయండి. లేదంటే జాగ్రత్త .దేవుడి పాలనలో ఇప్పుడొక కంటికి కన్ను పంటికి పన్ను అనే ఆటవికన్యాయం ప్రవేశపెట్టబడింది. జాగ్రత్త ఎన్ కౌంటర్ అయిపోగలరు . ఎన్ కౌంటర్ అయిన తర్వాత మీదగ్గర లేకపోయినా మీ శవాల దగ్గర తుపాకులు ,కత్తులు పెట్టబడి చాలా సహజంగా ఎన్ కౌంటర్ జరిపించినట్లు చూపించే తతంగం జరిగి చట్టం తన పని తానే ఎవరి ప్రమేయం లేకుండానే చేసుకుపోతుంది.

భక్తియొక్కటే తరుణోపాయం


అనేక జన్మకృత పుణ్యపరిపాకముచేతనే జనులకు భక్తిపై ప్రీతి గల్గుననియు, కలియుగమున భక్తియొక్కటే తరుణోపాయమనియు, భక్తిచేతనే కృష్ణుడు సాక్షాత్కరించుననియు పెద్దలు చెప్పిరి.

నృణాం జన్మ సహస్రేణ భక్తౌ ప్రీతిర్హి జాయతే !
కలౌ భక్తిః కలౌ భక్తిః భక్త్యా కృష్ణః పురః స్థితః !!

ప్రతిరోజూ ఒక మంచిమాట

దేశాభివృద్ధి అంటే అద్దాలమేడలు, రంగులగోడలు అభివృద్ధి చెందడం కాదు. పౌరుల నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి. మహాత్మా గాంధీ.

Friday, December 12, 2008

ఈ రోజు దత్త జయంతి--శ్రీ దత్తుని రూపంలో అంతరార్థం


దత్తం దత్తం పునర్దత్తం యోవదేత్ భక్తి సంయుతః !
తస్య పాపాని సర్వాణి క్షయం యాంతి న సంశయః !!


ఎవరైతే శ్రీ దత్తాత్రేయుని భక్తితో స్మరిస్తారో వారి సమస్త పాపములు నశిస్తాయి. దీనిలో సందేహం లేదని‘ దత్త హృదయం ’నందు చెప్పబడినది.

శ్రీ దత్తాత్రేయుడు కేవలం స్మరణ మాత్ర్ర సంతుష్టుడు. తీవ్రమైన పూజాదికాలు చేయకపోయినా “అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ” అనే పవిత్ర భావనతో, భక్తితో దత్త, దత్త అని స్మరిస్తే చాలు ఏదో ఒక రూపంలో వచ్చి, రక్షించి కోరిన కోరికలు తీర్చు దయామయుడు శ్రీదత్తాత్రేయుడు.

శ్రీభాగవత గ్రంథమునందు ప్రథమస్కంధ, తృతీయాధ్యాయములో భగవంతుని 21 అవతారములలో ఆరవ అవతారం దత్తాత్రేయుని అవతారమని చెప్పబడినది.

స్వామి స్మరణ రోగాలను పటాపంచలు చేస్తుంది.భూత, ప్రేత, పిశాచ, గ్రహబాధలను దూరం చేస్తుంది. పీడకలలు దరిరావు. సర్ప,వృశ్చికాది జనిత విషబాధలు, కుష్టు మొదలైన వ్యాధులు నశిస్తాయి. త్రికరణశుద్ధి కలుగుతుంది. కోరిన కోర్కెలు నెరవేరి జీవితము ధన్యమవుతుంది.

శ్రీ దత్తుని రూపంలో అంతరార్థం

శ్రీ దత్తమూర్తి మూడు శిరస్సులతో, ఆరుభుజములతో, ఆయుధములతో, నాలుగు కుక్కలతో, ఆవుతో ఉన్నట్టు చిత్రించబడి ఉంటుంది. వీటికి గల అర్థాలను పరిశీలిస్తే

మూడు శిరస్సులు:

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సృష్టి, స్థితి, లయములు, ఓంకారములోని అ, ఉ, మ లు త్రిమూర్త్యాత్మక పరబ్రహ్మము.

నాలుగు కుక్కలు:

నాలుగు వేదములు ఇవి.
శ్రీ దత్తమూర్తి సకల వేదవిజ్ఞానమును అధిగమించిన జ్ఞానసాగరుడు.

ఆవు:

మనసే మాయాశక్తి. సంకల్ప, వికల్పములకు, సుఖదుఃఖములకు కారణమైన మాయను యోగబలముచే శ్రీదత్తమూర్తి కామధేనువుగా మార్చాడు.

మాల:

అక్షరమాల, సర్వమంత్రమయము, సమస్త వైఖరి, వాగ్జాలమునకు,సాహిత్యసంగీతములకు సర్వ వ్యవహారములకు మూలము.

త్రిశూలము :

ఆచారము, వ్యవహారము, ధర్మార్థ కామముల సంపుటి.

చక్రము:

అవిద్యా నాశకము, ఆత్మావలోకన, సామర్థ్యమును, వివేకమును కలుగచేయును.

డమరు:


సర్వవేదములు దీనినుంచి ప్రాదుర్భవించినవి.

కమండలము:

సమస్త బాధలను పోగొట్టును. శుభములను సమకూర్చును.

1.దిగంబరం భస్మవిలేపితాంగం !
బోధాత్మకం ముక్తితరం ప్రసన్నం !
నిర్మానసం శ్యామల తనుంభజేహమ్ !
దత్తాత్రేయం బ్రహ్మ సమాధియుక్తం !!

2. అనసూయాత్రి సంభూతా దత్తాత్రేయో దిగంబరః !
స్మర్తృగామి స్వభక్తాన ముద్ధార్థ భవసంకటాత్ !!


పై రెండు శ్లోకాలు నిత్యం 108 సార్లు పఠిస్తే కష్టాల బాధలుండవు.

3. నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో !
సర్వరోగ ప్రశమనం కురుశాన్తిం ప్రయచ్చమే
!!

ఈ శ్లోక జపంవల్ల రోగభయం ఉండదు. దీర్ఘకాలిక రోగాలు నిదానిస్తాయి.

4. అత్రేరాత్మ ప్రధానేన యోముక్తో భగవాన్ ఋణాత్ !
దత్తత్రేయం తమీశానం నమామి ఋణవిముక్తయే !!


ఈ శ్లోకజపం అప్పులబాధను నివారిస్తుంది.

5. విద్యుత్సుత మవిద్యం యత్ ఆగతం లోకనిందితం !
భిన్న జిహ్వం బుధం చక్రే శ్రీ దత్తం శరణం మమ !!


ఈ శ్లోక పఠనం వలన ఉన్నత విద్య లబిస్తుంది.

6. దరిద్ర విప్రగే హేయః శాకం భుక్త్యోత్త మశ్రియం !
దదౌ శ్రీ దత్త దేవః సదాదారిద్ర్యాత్ శ్రీ పదో2వతు !!


ఈ శ్లోకం దరిద్రం నుంచి విముక్తి కలిగిస్తుంది.

7.దూరీకృత్య పిశాచార్తిం జీవయిత్వామృతం సుతమ్ !
యో భూదభీష్టదః పాతునః సంతాన వృద్ధికృత్ !!


ఈ శ్లోకం సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది.

8. అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే !
సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః !!


ప్రతి నిత్యం పై శ్లోకాలన్నీ కానీ లేదా మీకవసరమైనవిగానీ పఠించి శ్రీ దత్తాత్రేయుని అనుగ్రహం పొందండి.





.

ప్రతిరోజూ ఒక మంచిమాట

మన లోపాలు ఇతరులకు చెప్పకుండా మనకు మాత్రమే తెలిపే వ్యక్తి నిజమైన మిత్రుడు. సెకర్.

Thursday, December 11, 2008

ప్రతిరోజూ ఒక మంచిమాట

తనకే ఎక్కువ ఉండాలనీ, తనే ప్రముఖ స్థానంలో ఉండాలనీ, తన అభిప్రాయాల్నే ఇతరులు అమోదించాలనే స్వార్థపూరిత ఆకాంక్ష, ఎదుటివారికి ఎక్కువ ఉన్నా, అధిపత్యంఉన్నా సహించలేనితనం, అసూయ , కోపం,కసి వీటివల్లే వ్యతిరేకత, వైరుధ్యం ఏర్పడతాయి. వ్యక్తిగతస్థాయిలో ప్రారంభమయినవే సమాజానికి వ్యాపిస్తాయి.

ఎటువంటి అకాంక్ష అయినా, ధనంకోసం అయినా, అధికారంకోసం అయినా స్వార్థంతో కూడుకొన్నదే, హింసాలోచనను పురికొల్పేదే.

నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచించటం తగ్గిపోయి, ఎవరి సౌకర్యం వారికి ముఖ్యం అవుతోంది. ఆర్థికాంశం మరింత ముఖ్యం అవుతోంది.

Wednesday, December 10, 2008

మా ఇంట్లో త్వరలో చిన్నికృష్ణుడు జన్మించబోతున్నాడు



మా ఇంట్లో త్వరలో చిన్నికృష్ణుడు జన్మించబోతున్నాడు.అంటే మీ ఇళ్ళు కారాగారమా అనేరు. కారాగారాల్లాంటి వైద్యశాలలోనే అనుకోండి. మా అమ్మాయి తొందరలో మా చిన్నికృష్ణునికి జన్మనివ్వబోతోంది.


క. గురుతరముగ( దన కడుపున( ,సరసిజగర్భాండభాండ చయములు గల యా
హరి దేవకి కడుపున భూ, భరణార్థము వృద్ధి( బొందె బాలార్కుక్రియన్. 69

తా. ఎంతో బరువైన బ్రహ్మాండ భాండాలెన్నో తన కడుపులో దాచుకొన్న విష్ణువు భూమి నుద్ధరించడానికి దేవకీదేవి కడుపులో ఉదయ సూర్యునిలాగున వృద్ధిపొందాడు.

సీ. సలిల మా యెలనా(గ జఠరార్భకుని( గాన( , జనిన కైవడి ఘర్మసలిల మొప్పె,
నొగి( దేజ మా యింతి యుదరడింభకు( గొల్వ( గదిసిన క్రియ దేహకాంతి మెరసె(
బవను( డా కొమ్మ గర్భస్థుని సేవింప నొలసె నా మిక్కిలి యూర్పు లమరె(
గుంభిని యా లేమ కుక్షిగు నర్చింప( జొచ్చుభంగిని మంటి చొరవ దనరె

ఆ. గగన మిందువదనకడుపులో బాలు సే, వలకు రూపు మెరసి వచ్చినట్లు
బయలువంటి నడుము బహుళ మయ్యెను బంచ, భూతమయు(డు లోన( బొదల సతికి . 73

తా. దేవదేవుడు పంచభూతాత్మకుడు అయిన విష్ణువు దేవకీదేవి గర్భంలో పెరుగుతూ ఉన్నాడు. పంచభూతాలలో జలములు వానిని చూడడానికి వెళ్ళినవా అన్నట్లు చెమటలు పోయడం మొదలెట్టాయి. అగ్ని ఆ కడుపులోని పాపడిని సేవించడానికి వచ్చినట్లు ఆమె శరీరం కాంతితో మెరిసింది. ఆ గర్భస్థుడైన శిశువును వాయుదేవుడు సేవించబోయినట్లు ఆమెకు నిట్టూర్పులు ఎక్కువైనవి. భూమి ఆ కడుపులోని బాలుని పూజించడానికి వెళ్ళినదా అన్నట్లు దేవకీదేవి మన్ను తినడం ఎక్కువైంది. గర్భంలో ఉన్న శిశువును సేవించడానికి ఆకాశం రూపం ధరించి వచ్చిందా అన్నట్లు కనుపించని ఆమె నడుము విశాలమైంది.

వ. తదనంతరంబ 74

సీ. అతివకాంచీగుణం బల్లన బిగియంగ వైరివధూ గుణవ్రజము వదలె
మెల్లన తవ్వంగి మెయిదీవ మెరు(గెక్క దుష్టాంగనాతనుద్యుతు లడంగె,
నాతి కల్లన భూషణములు పల్పలన గా( బరసతీభూషణపంక్తు లెడలె(,
గలకంఠి కొయ్యన గర్భంబు దొడ్డుగా( బరిపంథిదారగర్భములు వగిలె( ,

తే. బొల(తికల్లన నీళ్ళాడు ప్రొద్దు లెదుగ, నహితవల్లభ లైదువలై తనర్చు
ప్రొద్దు లన్నియు( గ్రమమున( బోవ( దొడ(గె, నువిదకడుపున నసురారి యింట(జేసి. 75

తా. దేవకీదేవి గర్భాన రాక్షసులను సంహరించే విష్ణువు ఉండడం వల్ల, ఆమెకు మొలనూలు నెమ్మదిగా బిగుస్తూ ఉంటే శత్రువుల భార్యల మంగళసూత్రాల త్రాళ్ళు జారిపోసాగాయి. ఆమె శరీర కాంతి హెచ్చుతూ ఉంటే పగవారి భార్యల శరీరకాంతులు మాసిపోసాగాయి. ఆమెకు ఆభరణాలు బరువు అవుతూ ఉంటే శత్రుభార్యల ఆభరణాలు సడలిపోసాగాయి. ఆమె గర్భం బరువెక్కుతూ ఉంటే, శత్రుభార్యల కడుపులు జారిపోసాగాయి. ఆమెకు ప్రసవించే దినాలు దగ్గరవుతున్నకొద్దీ, శత్రుభార్యలు ముత్తైదువులుగా ఉండే దినాలు తరిగి పోవసాగాయి.

పోతన భాగవతం ,దశమస్కంధం, పూర్వభాగం

ప్రతిరోజూ ఒక మంచిమాట

మానవ జన్మ సార్థకం కావాలంటే మానవ వృక్షమై, సమాజానికి చల్లని నీడగా, తీయని ఫలంగా పరిమళ పుష్పాలుగా ఉపయోగపడాలి
స్వామి వివేకానంద.

Tuesday, December 9, 2008

నేడు గీతాజయంతి



నేడు గీతాజయంతి. మార్గశీర్షమాస శుద్ధఏకాదశిరోజున గీతాజయంతిని జరుపుకుంటున్నాము. భగవద్గీత ఉపనిషత్సారం, భారతం పంచమవేదం. భగవద్గీతని నేర్పుగా భారతకథలోకి చొప్పించి, అది సామాన్య మానవుడికి ఎక్కడ, ఏ విదంగా తోడ్పడుతుందో నిరూపించారు వ్యాసభగవానుడు.

సామాన్యమానవుడు పూర్తిగా బాహ్యప్రపంచంలో మునిగిపోయి ఉక్కిరిబిక్కిరవుతూంటాడు. అతడు అందులోంచి బయటపడి గట్టెక్కి తరించడానికి భగవద్గీత పద్దెనిమిది మెట్లు చూపుతుంది. ఒక్కొక్కమెట్టు అతడిని భగవంతుడికి చేరువగా తీసుకువస్తుంది. కాబట్టి ప్రతి అధ్యాయాన్ని యోగమన్నారు.

అధ్యయనం అంటే చదువుకోవడం. ముందు శ్లోకాలని తప్పులు లేకుండా సరిగా పారాయణ చేయడం రావాలి. దాని తర్వాత ధీశక్తిని వినియోగించి, లోతుగా మననం చేసి, పూర్తిగా అర్థం చేసుకోవాలి. అప్పుడే అధ్యయనం మనల్ని ప్రభావితం చేస్తుంది. ఆ తరువాత అధి+అయనం అంటే ప్రపంచ పరిమితులను అధిగమించి అనంతంలోకి ప్రయాణించాలి. ఈ మూడోస్థాయిని చేరుకొని అనంతంలో లీనమయ్యేవరకు జీవుని సాధన జన్మజన్మల వరకు సాగుతూనే ఉంటుంది.

కొందరు పూర్వజన్మలో కొద్దో గొప్పో సాధన చేసివుండవచ్చు. కొందరు బాగా దూరం వరకు వచ్చివుండవచ్చు. మరికొందరు బాగా పక్వదశకి చేరుకొని వుండవచ్చు.వాళ్ళందరూ ఈ పద్దెనిమిది మెట్లూ ఎక్కవలసిన అవసరంలేదు. ఏ ఒక్క అధ్యాయాన్నో ఊతగా చేసుకుని నేరుగా భగవంతుణ్ణి చేరుకోవచ్చును. వారివారి పరిపక్వతలనుబట్టి భగవద్గీతవల్ల వేరువేరు ప్రయోజనాలు పొందవచ్చును సాధించవచ్చును కూడా. ఈ విషయం భారతం ద్వారా స్పష్టమౌతుంది.

భారతం కేవలం చారిత్రాత్మకమైన ఒక కథ కాదు. దేవుడు జీవుడైన చరిత్ర. చేయరాని పనులుచేసి అగచాట్లుపడే జీవుని చరిత్ర. తాను సృజించుకొన్న విషమవాతావరణం నుండి వెలువడడానికి వెతలుపడే చరిత్ర. బయటపడే సమయం వచ్చేసరికి భయంతో, మమకారంతో విషాదంలో పడే చరిత్ర. భగవద్గీతా సందేశాన్ని అందుకొని విషాదంలో నుండి, వ్యామోహంలో నుండి విడుదలై, పతనావస్థనుండి ఉత్థానం చెంది తిరిగి దేవుడైన చరిత్ర. భారతం యొక్క సందేశసారం భగవద్గీత. భగవద్గీత యొక్క కార్యాచరణ రూపం భారతం. భారతమణిమాలలో భగవద్గీత అందమైన పచ్చల పతకం.       ---   స్వామిని శారదాప్రియానంద

ప్రతిరోజూ ఒక మంచిమాట

సమానత్వం చట్టంద్వారా రాదు.సమానత్వం ఒక ఆదర్శం కాకుండా, మన స్వభావంలోనూ, మన దినచర్యలోనూ భాగంకావాలి.
ప్రతిఒక్కరూ తక్కిన వారిని మానవులుగా గౌరవించగలిగినప్పుడే సమానత్వం ఏర్పడుతుంది. తోటివారిని దోచుకోకుండా, మానవత్వంతో, సంస్కారంతో ప్రవర్తించినప్పుడే సమానత్వం ఏర్పడుతుంది. జిడ్డు కృష్ణమూర్తి.

Monday, December 8, 2008

తిరుమల గిరులు--అలిపిరి దృశ్యం --బొమ్మ

ప్రతిరోజూ ఒక మంచిమాట

సమాజంలో ఎన్నో మార్పులు వచ్చాయి.అయినా మనుషుల మౌలిక మనస్తత్వంలో మార్పు లేదు. మారవలసినవి మనుషుల ఆలోచనలు.మన ఆలోచనలవల్ల ఇతరులకి ఎటువంటి హాని జరుగుతుందో నిజంగా అవగాహన చేసుకోగలిగినప్పుడు,మార్పు దానంతటదే వస్తుంది. అవగాహన చేసుకోవడం ముఖ్యం---జిడ్డు క్రిష్ణమూర్తి.

Sunday, December 7, 2008

ప్రతిరోజూ ఒక మంచిమాట

పిడికెడు లోకజ్ఞానం మానిక చదువుకు సమానమైనది.

Saturday, December 6, 2008

కృష్ణ --బొమ్మ


క. దేహము కారాగేహము, మోహము నిగళంబు, రాగముఖరములు రిపు
వ్యూహములు భక్తితో ని, న్నూహింపని యంతదడవు నో కమలాక్షా ! 574


తా.కమలములవంటి కన్నులుగల కృష్ణా ! భక్తితో నిన్ను స్మరించనంతకాలమూ ఎవరికైనా శరీరం కారాగారమూ, మోహము అనేది సంకెళ్ళూ, రాగద్వేషాదులు శత్రువ్యూహాలూ అవుతాయి.

పోతన భాగవతం ,దశమస్కంధం, పూర్వభాగం

ప్రతిరోజూ ఒక మంచిమాట

మనల్ని ఇతరులు ఎలా గౌరవించాలని వాంఛిస్తామో , అదే గౌరవం ఇతరులపట్ల చూపడాన్ని సభ్యత అంటాము

Friday, December 5, 2008

ప్రతిరోజూ ఒక మంచిమాట

చదువుకున్నవారందరూ మానవాళి గురించి ఆలోచిస్తారు. కానీ తమ పొరుగువారిని మాత్రం వారు ద్వేషిస్తారు.

Thursday, December 4, 2008

ప్రతిరోజూ ఒక మంచిమాట

మనకి ఎవరైనా అసహనం కలిగించినప్పుడు,వెంటనే ప్రతీకారదృష్టితో ఆలోచించకుండా ఎదుటి వ్యక్తివైపు నుంచి కూడా ఆలోచించిచూస్తే,మన మనస్సులో కొత్త మార్పు రావచ్చు.మాత్రలూ,మంత్రాలూ వాడటం కాకుండా,‘నాకు అసహనం ఎందుకు కలిగింది’ అని పరిశీలించుకుని మన ఆలోచన ధోరణిని అవగాహన చేసుకోగలిగితే,అసహనం దానంతటదే అంతరించిపోతుంది.---జిడ్డు క్రిష్ణమూర్తి

Wednesday, December 3, 2008

శ్రీకృష్ణ --బొమ్మ


మ. గోపదరేణు సంకలిత కుంతల బద్ధమయూరపింఛు ; ను
ద్దీపిత మందహాస శుభదృష్టి లసన్ముఖు నవ్యపుష్ప మా
లా పరిపూర్ణు గోపజనలాలిత వేణురవాభిరాము నా
గోప కుమారునిం గనిరి గోపసుతుల్ నయనోత్సవంబుగన్
.

తా. గోపకులంలోని గోపికలు గోపకుమారుడైన కృష్ణుని కన్నుల పండువుగా చూచారు. ఆ కృష్ణుడు గోధూళి ఆవరించిన తలవెంట్రుకలపై నెమలి ఫించం ధరించి ఉన్నాడు. వెలుగులు చిమ్ముతున్నా చిరునవ్వులతో, శుభాన్ని కల్గించే చూపులతో అతని ముఖము ప్రకాశిస్తూ ఉన్నది. క్రొత్త క్రొత్త పూలమాలికలను ధరించి ఉన్నాడు. గోపకులందరూ బతిమలాడితే వేణునాదం చేస్తూ అందరి మనస్సులకూ ఆనందం కలిగించాడు. పోతన భాగవతం ,దశమస్కంధం, పూర్వభాగం 627

ప్రతిరోజూ ఒక మంచిమాట

తలపులలో ఘనత వహించినట్లే పనులలో కూడా ఘనత వహించు, మాటకు అనుగుణంగా పనిచేయి, పనికి అనుగుణంగా మాట్లాడు.

Monday, December 1, 2008

గోపాలబాలుడు---బొమ్మ



క్రతుశతంబుల( బూర్ణకుక్షివి, కాని నీ విటుక్రేపులున్
సుతులునై చను(బాలు ద్రావుచు( జొక్కియాడుచు( గౌతుక
స్థితి ( జరింప(గ( దల్లులై విలసిల్లు గోవుల గోపికా
సతుల ధన్యత లెట్లు సెప్ప(గ( జాలువా(డ( గృపానిధీ ! 569


తా. ఓ కృపానిధీ ! నీవు యజ్ఞపురుషుడవు. వందలకొద్దీ యజ్ఞాలు నీ కడుపులో దాగి ఉన్నాయి. అయినా నీవు ఈ విధంగా లేగలుగానూ, గోపబాలురుగానూ రూపాలు ధరించి ఉన్నావు. గోవులవద్ద గోపికలవద్ద నీ వు పాలు త్రాగి పరవశిస్తూ, ఆటలు ఆడుతూ, ఎంతో ఉత్సాహంగా సంచరిస్తున్నావు. నీకు తల్లులు కాగలిగిన ఆ గోవులు , గోపికలు ఎంత పుణ్యం చేసుకున్నారో ఎలా చెప్పగలను ? నీవు కరుణామయుడవు కనుకనే ఆ గోవులు, గోపికలు అంత ధన్యత్వాన్ని అందుకోగలిగారు.

పోతన భాగవతం ,దశమస్కంధం, పూర్వభాగం

ప్రతిరోజూ ఒక మంచిమాట

చీకటిని దూషించడంకంటే ఒక దీపాన్ని వెలిగించడం మంచిది.