Wednesday, November 25, 2009
ప్రజాస్వామ్యమే ప్రధానిని చేసింది --మన్మోహన్ సింగ్ హ్హ హ్హ హ్హ
దేశానికి నాయకత్వం వహించే అవకాశం లభిస్తుందని ఎన్నడూ అనుకోలేదని ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు.భారత్ లో ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థ కారణంగానే తనకు ఆ అవకాశం దొరికిందన్నారు .క్షమించండి భారత్ లో ఉన్న సోనియా స్వామ్య వ్యవస్థ కారణంగానే తనకు ఆ అవకాశం దొరికిందన్నారు.
నేను అందుకున్న విద్య నన్ను తీర్చిదిద్దింది.అదేనండి సోనియమ్మ ఏమి చెప్పిన తలాడించడమేనండి ఆ విద్య.
ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్న భారత్ వంటి పెద్దదేశాలు ప్రపంచంలోనే అరుదని ప్రధాని చెప్పారు.నిజమే మరి పేరుకేనండిప్రజాస్వామ్యం
అంతాసోనియాస్వామ్యమూ,
బానిసస్వామ్యమూ,
పెత్తందార్లస్వామ్యమూనూ..
ఐదు,పదేళ్ళలోనే వేలకోట్లు వెనకోసుకోవడం మా దేశంలోనే సాధ్యం
న్యాయరంగంలో జాప్యాన్ని నివారించేలా చర్యలు తీసుకుంటాము.ప్రధానమైన కేసులకు పట్టే ఇరవై,ముప్ఫై ఏళ్ళ జాప్యాన్ని ఇంకో ఐదేళ్ళో పదేళ్ళో కొనసాగేటట్లు చేస్తాం.ఇక మామూలు కేసులంటారా ! ఇక చెప్పేపనేలేదు.అదే విరోధులపై కేసులయితేనా మనకు ఎప్పుడు అవసరమొస్తే అప్పుడే బయటకు తీస్తాం తీర్పులు వెలువరింపజేస్తాం.
భారత్ లో ఆర్థిక సంస్కరణల కొనసాగింపుపై ఎలాంటి అనుమానాలూ అవసరం లేదని ,అవి నిరాటంకంగా కొనసాగుతాయని అమెరికా పారిశ్రామిక రంగానికి భరోసా ఇచ్చారు. అంతే మరి మనదేశం ఏమైనా పరవాలేదులే,ఇప్పటికే ధరలు ఆకాశాన్నంటాయి ప్రజలకేమో పొదుపు పాటించండి ,ఉపవాసముండండి అని చెప్పే మా మంత్రులెలాగూ ఉన్నారు.
అన్ని టపాలు ఒకచోట
Monday, November 23, 2009
దశావతారములు -రామావతారం
Tuesday, November 17, 2009
కేసీఆర్ దీక్షకు పదివేలమంది కాపలానా ఎందుకు ?
తెరాస అధినేత కే.చంద్రశేఖర రావు నిరవధిక నిరాహారదీక్షకు పదివేలమంది పార్టి శ్రేణులు ఇరవై నాలుగు గంటలుకాపలా ఉంటారని సిద్ధిపేట ఎమ్మెల్యే హరిశ్ రావు తెలిపిన నేపథ్యంలో నా మదిలో కొన్నిసందేహాలు మెదిలాయి .
ఆయన నిరాహార దీక్షలో ఉండగా ఏమీ తినకుండా ఉండడానికి కాపలానా ? లేక
తింటూ ఉంటే ప్రజలుగానీ ,మీడియావాళ్ళు గానీ చూడకుండా నిరోధించడానికా? లేక
ఇంతకు మునుపు దీక్షను ఒకపూటలోనే విరమించాడు ,ఇప్పుడు అలా విరమించకుండా చేయడానికా ?
మీకేమైనా తెలిస్తే నాకు చెబుతారా !
నా టపాలన్నీ ఒకచోట
Monday, November 16, 2009
దశావతారములు -పరశురామావతారం
క. ఇరువదొకమార్లు నృపతుల
శిరముల ఖండించి తౌర చేగొడ్డంటన్
ధర గశ్యపునకు నిచ్చియు(
బరగవె జమదగ్ని రామభద్రు(డ కృష్ణా.
తా. కృష్ణా ! పరశురామావతారమెత్తి యిరువదొక్కమార్లు రాజుల ఖండించి కైకొన్న భూమిని కాశ్యపున కొసంగితివి. నీ మహిమ చిత్రము.
శ్రీ కృష్ణశతకము
Saturday, November 14, 2009
Thursday, November 12, 2009
Tuesday, November 10, 2009
దశావతారములు --వామనావతారం
క. వడుగవునై మూ(డడుగుల
నడిగితివా బలిని భళిర యఖిల జగంబుల్
తొడిగితివి నీదు మేనున
గడుచిత్రము నీ చరిత్ర ఘనుడ(వు కృష్ణా .
తా. కృష్ణా ! వామనావతారమెత్తి, బలిని మూ(డడుగుల భూమి నడిగి లోకములన్నిటిని నీ మేనితో నింపితివి మహాత్మా ! నీ చరిత్ర కడు చిత్రము.
శ్రీ కృష్ణశతకము
Subscribe to:
Posts (Atom)




